Ads
లాక్ డౌన్ లో ఎవడి గోల వారికుంటే.. ఇలాంటి ఛాన్స్ పోతే మళ్లీ రాదనుకున్నారో ఏమో ఆ జంట మాత్రం దొరికిందే ఛాన్స్ అనుకుని పెళ్లి చేసేసుకున్నారు .మరేం చేస్తారు , పెద్దలు ఒప్పుకోవట్లేదు, ఇప్పుడైతే అందరూ బయటకి వచ్చే పరిస్థితి లేదు.. సో పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. తర్వాత వచ్చిన పెద్దలు ఒప్పుకోకతప్పలేదు.. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన వివరాలు..
Video Advertisement
తిరుచ్చికి చెందిన వినోద్ వయసు 25 , ఐటిఐ పూర్తి చేసాడు. ఇతను తిరుచ్చి అరియమంగళంలో బస్సు, లారీలకు బాడీ తయారు చేసే షెడ్‌లో పని చేస్తున్నాడు . ఇతడి ప్రేయసి పేరు జీవిత, వయసు 20. బియస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుంది . జీవిత తన కాలేజ్ కి దగ్గర లో ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ ఉండేది. అక్కడే వినోద్ పరిచయం అయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరివి వేరు వేరు కులాలు, ఇంకేముంది పెద్దలు వీరి ప్రేమకు నో చెప్పారు. అయినప్పటికి వారిద్దరూ పెద్దల మాట వినకుండా కలుసుకుంటూనే ఉండేవారు.
ఇప్పుడు లాక్ డౌన్ తో ఇద్దరూ ఒకరినొకరు కలుసుకోవడం కష్టం అయింది. ఎడబాటు భరించలేకపోయారు. ఎలాగు పెద్దలు వారి ప్రేమకి,పెళ్లిక అంగీకరించరు. దాంతో పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించారు. తిరుచ్చిలో 144సెక్షన్ అమలులో ఉంది. ఎవరూ బయటికి రాకూడని పరిస్థితి. ఈ పరిస్తితుల్లో జీవిత ఇంటి నుండి బయటకి వచ్చి వినోద్ ని కలిసింది. ఇద్దరూ దగ్గరలోని గుడిలో పెళ్లి చేసుకుని నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్లారు.
ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు వారికి అండగా నిలిచారు. ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడారు. కులాలు ముఖ్యం కాదని, పిల్లల సంతోషం ముఖ్యమని పెద్దలకి నచ్చచెప్పి పంపించారు. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ న్యూస్ చూసిన చాలామంది ఇదే మంచి టైం , పేరెంట్స్ కూడా ఏం చేయలేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..పేరెంట్స్ ఏం చేయకపోవచ్చు తమ్ముడు, కరోనా ఊరుకోదుగా..కాబట్టి ఎలాంటి ప్లాన్స్ వేయకుండా జాగ్రత్తగా ఉండండి.
End of Article