అతను రోదిస్తున్న ఫోటో వైరల్ అయ్యింది…ఇప్పుడు అతను ఏమయ్యారో తెలుసా?

అతను రోదిస్తున్న ఫోటో వైరల్ అయ్యింది…ఇప్పుడు అతను ఏమయ్యారో తెలుసా?

by Sainath Gopi

Ads

రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తూ ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి ఫొటోని సామాన్యుల నుండి సెలబ్రిటి వరకు అనేక మంది శేర్ చేశారు..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైన ఫోటోల్లో అతడిది ఒకటి.. వలస కూలీలు ఒక్కొక్కరిది ఒక్కో కథ అయితే..ఈ వ్యక్తిది ఒక కథ..ఆ ఫోటో శేర్ చేసే సమయానికి ఎవరికి ఆ విషయం తెలీదు..కానీ ఆ ఫోటోలోని కన్నీటి వెనుక హృదయ విదారక కన్నీటి కథ ఉంది.. అదిప్పుడు నెటిజన్లను మరింతగా బాధపెడుతోంది..

Video Advertisement

బీహార్ లోని బెగుసారై కి చెందిన రామ్ పుకార్ , నవాడా లో వలస కూలిగా ఉపాది పొందుతున్నారు.. లాక్ డౌన్ కారణంగా పనులు లేక, రవాణా సౌకర్యం లేక ఊరికి వెళ్లకుండా నవాడాలోనే ఆగిపోయారు.. కానీ రామ్ పుకార్ ఏడాది వయసు కొడుకు చనిపోయాడని ఇంటి నుండి ఫోన్ రావడంతో, ఏం ఆలోచించకుండా కాలినడకన  ఊరికి వెళ్లాలని బయల్దేరాడు.కానీ  ఘజియాబాద్ ఫ్లైఓవర్ చేరుకునే సరికి పోలీసులు రామ్ పుకార్ ని ఆపేశారు..

తన కుమారుడు చనిపోయాడని,వెళ్లాలని ఎంత వేడుకున్నా పోలీసులు కనికరించకపోవడంతో అక్కడే రోడ్డు పైన కూలబడిపోయి ఇంటికి ఫోన్ చేసి ఏడుస్తున్నప్పుడు అక్కడే ఉన్న పిటిఐ ఫొటోగ్రాఫర్ అతుల్ యాదవ్ తీసిన ఫోటోనే అది. ఎన్జీవో కార్యకర్తలు పెట్టిన ఫూడ్ తింటూ మూడు రోజుల పాటు రామ్ పుకార్ అక్కడే ఉండిపోయాడు. పోలీసులు తన మాట వినలేదని లేదంటే కనీసం నా కొడుకు చివరి చూపుకు అయినా నోచుకునేవాడిని, నేను లేకుండానే నా కుటుంబం ఒంటరిగా నా కొడుకుకి వీడ్కోలు పలికింది..

representative image

తన బంధువులతో ఫోన్ లో తన ధీనస్థితి గురించి మొరపెట్టుకుంటున్న ఫోటో వైరల్అ అయ్యే సరికి అతని కథ ఏంటి? ఇప్పుడు అతను ఏమయ్యారు అని తెలుసుకోవాలని నెటిజెన్స్ సెర్చ్ చేసారు. దాతలు ఆ ఫొటోకు స్పందించి అతనికి సహాయం చేసారు.శ్రామిక్‌ రైలులో సొంతూరు బిహార్‌లోని బెగూసరాయ్‌కు అతను చేరుకున్నారు. అతను నీరసంగా ఉండటంతో దగ్గరలోని ఓ హాస్పిటల్ లో చేర్పించారు. విషయం తెలుసుకున్న అతని భార్య, కూతురు ఎట్టకేలకు ఆయనను ఆస్పత్రిలో కలుసుకున్నారు.


End of Article

You may also like