Ads
“చంద్రుడిలో ఉందే కుందేలు కిందికొచ్చిందా..కిందికొచ్చి నీలా వాలిందా” ఈ పాట వచ్చి దశాబ్దం దాటినా ఆ పాటకి, అందులో తన అభినయానికి ఇంకా క్రేజ్ తగ్గలేదు..కళ్లతో ఎక్స్ప్రెషన్స్ పలికించే నటులు అతికొద్దిమంది వాళ్లల్లో త్రిష ఒకరు..
Video Advertisement
ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినా ఇంకా అదే మార్క్ యాక్టింగ్తో, ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటునే ఉంది.. అందాల నటి త్రిష ఇటీవలే 39వ పడిలోకి అడుగు పెట్టారు.. సినిమా ఇండస్ట్రీ లో కెరీర్ ప్రారంభించి చాలా కాలమే అయినా.. ఇప్పటికీ తిరుగులేని ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న నటిగా త్రిష పేరు తెచ్చుకున్నారు.
ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. అలా.. సెలెబ్రిటీలను పోలిన మనుషులను చూస్తే అందరికి సహజంగానే ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలను పోలిన మనుషులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. హీరోయిన్ త్రిషని పోలిన ఓ అమ్మాయి ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ అమ్మాయి పేరు దీపికా విజయ్.
అచ్చం త్రిషలా ఉన్న ఈ అమ్మాయి త్రిష కంటే కొంచం సన్నగా ఉంటారు. ఈ అమ్మాయి ఫోటోలను చూస్తే హీరోయిన్ త్రిష సన్నబడిందా అన్న అనుమానం కలగక మానదు. అచ్చం త్రిషని పోలిన ఈ అమ్మాయి ఫోటోలు ప్రస్తుతం ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఈమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో రీల్స్ చేస్తూ ఉంటారు. ఈ రీల్స్, ఫోటోలలో అచ్చం త్రిషని పోలి ఉండడంతో ఈమె త్రిషకి చెల్లెలా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీపికా విజయ్ మైసూర్ కు చెందిన అమ్మాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న దీపికా ఫోటోలను కింద ఇంస్టాగ్రామ్ ఖాతాలో మీరు కూడా చూసేయచ్చు.
https://www.instagram.com/p/CdauORWP-2o/
End of Article