Ads
ఉద్యోగం అనేది ప్రతి వ్యక్తికి అవసరమైనదే. అయితే.. టాలెంట్ ని బట్టీ ఉద్యోగం లభిస్తుంటుంది. దొరికిన ఉద్యోగాలను సరిపెట్టుకుని చేసే వారు కొందరైతే.. తమకు ఇష్టమైన ఉద్యోగం కోసం తెలివిగా ప్రయత్నాలు చేసేవారు మరికొందరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ అబ్బాయి రెండవ కోవకి చెందిన వ్యక్తి.
Video Advertisement
అయితే.. జాబ్ కొట్టాలనుకునే వారు ఎవరైనా తమ రెజ్యూమ్ ను డిఫరెంట్ గా ఉండాలని.. రిక్రూటర్లను ఆకర్షించాలని కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, జైపూర్ కు చెందిన అమన్ ఖండేల్ వాల్ చాలా వినూత్నంగా రెజ్యూమ్ ను పంపించారు.
ప్రస్తుతం ఏ సంస్థ అయినా రెజ్యూమ్ ఆధారంగానే ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అందరు పంపే రెజ్యూమ్ కంటే.. తన రెజ్యూమ్ భిన్నంగా ఉండాలని అమన్ భావించారు. జైపూర్ కు చెందిన అమన్ ఓ మానేజ్మెంట్ ట్రైనీ. జొమాటో బాయ్ గెటప్ లో అతను తన రెజ్యూమ్ ను వివిధ కంపెనీలకు పంపించాడు. ఇప్పుడు ఈ రెజ్యూమ్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పూణే లోని ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ నుంచి అమన్ పట్టభద్రులయ్యారు.
తాను మానేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ కోసం అప్లై చేయాలనుకున్నారు. ఇందుకోసం క్రియేటివ్ గా ఆలోచించి.. జొమాటో బాయ్ అవతారం ఎత్తారు. పేస్ట్రీ బాక్స్ లో కేక్స్ తో పాటు తన రెజ్యూమ్ ను కూడా పంపించారు. ఈ విషయాన్నీ ట్విట్టర్ లో పంచుకున్నారు. “అందరి రెజ్యూమ్ లు డస్ట్ బిన్ లోకి వెళ్తూ ఉంటాయి.. నా రెజ్యుమ్ మాత్త్రం మీ పొట్టలోకి వెళ్తుంది” అంటూ టాగ్ లైన్ కూడా రాసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది. డంజో, జొమాటో వంటి సంస్థలు కూడా అతడి క్రియేటివిటీని మెచ్చుకున్నాయి. మరోవైపు ఇదో క్రేజీ రెజ్యూమ్ అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/AmanKhandelwall/status/1543203379501236226?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1543203379501236226%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fmy-resume-is-in-your-belly-check-out-this-guys-unique-style-of-applying-for-jobs-au76-742204.html
End of Article