Ads
తమిళనాడు పరిసర ప్రాంతాల్లో భారీ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రక్షణ దళాల ప్రధాన అధిపతి బిపిన్ రావత్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర అధికారులతో కలిసి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది.
Video Advertisement
ఈ వార్తతో యావత్ దేశం షాక్ లో మునిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ దుర్ఘటనపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కాగా.. తమిళనాడులోని కూనూర్ ప్రాంతంలో ఉండే దట్టమైన మంచు కారణంగానే హెలికాప్టర్ కూలిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఆర్మీ దళానికి చెందిన 13 మంది దుర్మరణం చెందారు. బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ కూడా మృతి చెందారు. రక్షణ రంగంలో ఎనలేని సేవలు అందించిన బిపిన్ రావత్ మృతి చెందడంతో యావత్ దేశం దిగ్బ్రాంతిలో కూరుకుపోయింది. 1978 లో ఆర్మీ లో చేరిన బిపిన్ ఆయన తండ్రి పని చేసిన 5 వ బెటాలియన్ లోనే పని చేసారు. బిపిన్ రావత్ 2016 డిసెంబర్ 17న 27వ చీఫ్ ఆర్మీ అధికారిగా ఎంపిక అయ్యారు.
ఆయన కోసం ఆర్మీ అధికారుల రిటైర్మెంట్ వయసును 62 నుంచి 65 కు పెంచారంటే.. ఆయన అందించిన సేవలు ఎటువంటివో తెలుస్తుంది. 2019 లో ఆయనను త్రివిధ దళాల అధిపతిగా నియమించారు. అప్పటినుంచి తన ప్రతిభతో, దక్షతతో ఆయన శత్రుమూకను ఎదుర్కొంటు వచ్చారు. ఇంతటి వీరుడుని ఓ ప్రమాదం కారణంగా కోల్పోవడం దురదృష్టకరం.
ఈ ప్రమాదానికి ముందు గాలిలో హెలికాప్టర్ వెళ్తుండగా వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ హెలికాప్టర్ ప్రయాణం చేస్తున్న సమయంలో వాతావరణం అనుకూలంగా లేదని.. మంచు దట్టంగా కప్పేసింది అని ఈ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. హెలికాప్టర్ ఓ కూలిపోతూ ఓ చెట్టుకు గుద్దుకుని పడిపోయింది. ఆ సమయంలో వచ్చిన శబ్దానికి చుట్టుపక్కల అందరు బయటకి వచ్చి చూడడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
#HelicopterCrash #ArmyHelicopterCrash
First Video: బిపిన్ రావత్ హెలికాప్టర్ కూలిపోవడానికి ఒక్క క్షణం ముందు వీడియో ఇది.. pic.twitter.com/1knGIN1hxR
— News18 Telugu (@News18Telugu) December 9, 2021
End of Article