Ads
కొన్ని కొన్ని సార్లు ఊహించని సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. వాటిని మనం ఎంత చాకచక్యంగా ఎదుర్కొంటే.. అంత త్వరగా ఇబ్బందిని అధిగమించగలుగుతాము. మీరు మీ బండి మీద వెళ్తున్నారు అనుకోండి. ఉన్నట్లుండి బండి హేండిల్ నుంచి నాగుపాము లేస్తే ఏమి చేస్తారు.
Video Advertisement
ఎవరైనా బెంబేలెత్తిపోతారు. స్కూటర్ ని అక్కడ పడేసి పరుగు లంకించుకుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం చాలా ఓపికగా, నైపుణ్యంతో ఆ పాముకి హాని చేయకుండా.. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా ఆ పాముని పట్టాడు.
ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. ముందు స్కూటర్ హెడ్ లోపల ఉన్న ఆ నాగుపాముని బయటకి రప్పించాడు. బయటకు రాగానే ఆ నాగుపాము ఒక్కసారిగా పడగ విప్పింది. బుసలు కొడుతూ కాటు వేయబోయింది. కానీ ఆ వ్యక్తి సహనం వహించాడు.
నిదానంగా ఆ పాముని వాటర్ కాన్ లోకి ఎక్కించే ప్రయత్నం చేసాడు. ఆ పాము బయటకి వచ్చి బుసలు కొట్టడానికి ప్రయత్నించగా.. చాకచక్యంతో దానిని లోపలకి పంపించాడు. చివరకు ఆ పాము లోపలకి వెళ్ళగానే క్యాప్ ని బిగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని చాకచక్యానికి నెటిజన్స్ విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు. ఈ వీడియో ను మీరు కూడా కింద చూసేయండి మరి.
Such guests during rains are common…
But uncommon is the method used to rescue it. Never ever try this😟 pic.twitter.com/zS4h5tDBe8— Susanta Nanda (@susantananda3) September 7, 2021
End of Article