Ads
ఎంతగానో ఎదురు చూస్తున్న పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా గత రెండు ఏడాదిలు పరీక్షలు సరిగ్గా జరగని సంగతి తెలిసిందే. విద్యార్ధులందరిని ఒకేసారి పాస్ చేసేసారు. దానితో గత రెండేళ్లుగా.. టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల పాస్ పర్సంటేజ్ వంద శాతంగా ఉంది.
Video Advertisement
కానీ, ఈ ఏడాది మాత్రం పరీక్షలను నిర్విఘ్నంగానే నిర్వహించారు. అయితే.. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పాఠశాల సరిగ్గా నడవలేదు. ఈ ఎడ్యుకేషన్ ఇయర్ లో కూడా కొన్ని పాఠశాలలలో క్లాస్ లకు ఆటంకం ఏర్పడింది.
మరోవైపు.. రెండేళ్లు ఆన్ లైన్ విద్యకే పరిమితమైన విద్యార్థులు ఈ ఏడాది పదవతరగతి పరీక్షలకు హాజరు అవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో గత ఐదారేళ్ళతో పోలిస్తే పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ వచ్చింది. గత రెండేళ్లు వంద శాతం ఉండగా.. ఆ కింద సంవత్సరాలు వరుసగా 94.88 , 94.48, 91.92, 93.26 శాతాలను తెచ్చుకోగా.. ఈ ఏడాది పాస్ పర్సంటేజ్ మాత్రం కేవలం 64.02 శాతం మాత్రమే ఉంది.
చాలా మంది ఫెయిల్ అవ్వడంతో విద్యార్థుల ఆవేదన తీరనిదిగా ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ అమ్మాయి వీడియో తెగ వైరల్ అవుతోంది. తనకు అన్ని సబ్జెక్ట్స్ లోను ఎక్కువ మార్కులు వచ్చాయని.. ఒక్క సోషల్ సబ్జెక్టు లో మాత్రమే నాలుగు మార్కులు తగ్గాయని చెప్పుకొచ్చింది. ఒక్క నాలుగు మార్కులను పట్టుకుని ఎట్లా ఫెయిల్ చేస్తారు సార్… మమ్మల్ని పాస్ చేయాలి సార్ అంటూ సదరు స్టూడెంట్ ఆవేదన చెందుతోంది. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Watch Video:
https://www.instagram.com/p/CegQpnSJLmp/
End of Article


