సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రపంచంలో ఏ మూల ఏ ఘటన జరిగినా అది నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందరు ఆ వీడియోలను తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా చూడగలుగుతున్నారు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టామంటే.. మనం ఎంతో జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్, వీడియో రికార్డింగ్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చిన తరువాత మన ప్రతి నడకా రికార్డు అయ్యే అవకాశం ఉంటుంది.
ఇలా ఊహించని విధంగా రికార్డు అయిన వీడియోలు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ట్రైన్ లో రికార్డు అయిన ఓ వీడియో సోషల్ మీడియా తెగ హల్ చల్ చేస్తోంది. అంతలా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏమి ఉందొ ఇప్పుడు చూసేద్దాం.
బస్ స్టాండ్ లో అయినా, రైల్వే స్టేషన్ లో అయినా.. మన గమ్యం చేరేవరకూ అప్రమత్తంగానే ఉండాలని హెచ్చరిస్తూ ఉంటారు. ముఖ్యంగా అపరిచితుల విషయంలో జాగరూకతతో వ్యవహరించాలని.. వీలైనంత వరకూ వారికి దూరంగా ఉండాలని అనుక్షణం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. కానీ.. ఓ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్న ఈ అమ్మాయి మాత్రం ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టింది. ట్రైన్ లో తనతో పాటు ప్రయాణం చేస్తున్న ఓ అపరిచితుని వలలో పడిపోయింది.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటి మాటలు కేవలం సినిమాలలో చూడడానికే బాగుంటాయి. కానీ, రియల్ లైఫ్ లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. ట్రైన్ లో ప్రయాణం చేస్తున్న ఈ అమ్మాయి.. తన వెనుక కూర్చున్న అపరిచిత వ్యక్తితో ప్రేమలో పడిపోయింది. ఏ విషయాలు తెలియకుండానే.. ఆమె తన మనసుని అప్పగించేసింది. ఎవరూ చూడడం లేదని గమనించుకున్న ఆ అమ్మాయి.. ఓ వైట్ పేపర్ పై తన మనసులోని మాటలను రాసి ఇచ్చేసింది. ట్రైన్ రద్దీ గా ఉండడంతో.. ఎవరూ గమనించలేదు. కానీ ఓ వ్యక్తి ఈ తతంగమంతా వీడియో తీసి నెట్టింట్లో పెట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు కూడా చూసేయచ్చు.
Watch Video: