Ads
పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా ముఖ్యమైనదే. ముఖ్యంగా అమ్మాయిల జీవితంలో పెళ్లి తరువాత చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకే అమ్మాయిలు తమకి భర్తగా వచ్చే అబ్బాయి విషయంలో చాలా ఆశలు పెట్టుకుంటారు. తమకు కాబోయే భర్త ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు.
Video Advertisement
అయితే ఈ అమ్మాయి మాత్రం ఏకంగా ఓ అగ్రిమెంట్ నే రాసేసింది. తన భర్త పెళ్లి అయ్యాక ఏ పనులు చేయకూడదో.. ఏ పనులు చేయాలో ఓ అగ్రిమెంట్ రాసేసి పెళ్ళికి ముందే భర్తతో సంతకం పెట్టించేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన జీవితంలోకి వచ్చే వరుడు ఎలా ఉండాలి అన్న విషయమై ఆమె ముందే ఓ అగ్రిమెంట్ రాసి పెట్టుకోవడం, దానిపై ఆ వరుడు సంతకం చేయడం.. ఇదంతా చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇదెక్కడి కాంట్రాక్టు పెళ్లి అని షాక్ అవుతున్నారు. కానీ కొందరు అమ్మాయిలు మాత్రం ఇదే కరెక్ట్ అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఆ అగ్రిమెంట్ పేపర్ లో ఏమి రాసారో తెలుసా..? రోజుకి కనీసం 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు వరుడు ఆ అమ్మాయికి ఐలవ్ యు అని చెప్పాలట. అలాగే ఆ అమ్మాయి లేకుండా బటర్ బోన్ లెస్ చికెన్ తినను అని వాగ్దానం చేయాలట. అలాగే అతని తల్లి పై ఒట్టు వేసి నమ్మకం ఎప్పటికీ పోగొట్టుకోనని చెప్పాలట. మరణవరకు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి అని వాగ్దానం చేయాలి” అని రాసి ఉంది. ఇంకా ఇలాంటి కొన్ని కండిషన్స్ కూడా సదరు వధువు రాసి ఉంచింది.
https://www.instagram.com/reel/CaMwy3UOCU2/?utm_source=ig_embed&ig_rid=62fe3e30-74b3-4cc6-82e5-23591ecc88c9
End of Article