ఏ పాపం తెలియని ఫుడ్ డెలివరీ బాయ్ ని చెప్పుతో కొట్టాడు.. చివరిలో ట్విస్ట్ మాములుగా లేదుగా..!

ఏ పాపం తెలియని ఫుడ్ డెలివరీ బాయ్ ని చెప్పుతో కొట్టాడు.. చివరిలో ట్విస్ట్ మాములుగా లేదుగా..!

by Anudeep

Ads

ప్రజల పట్ల ఫ్రెండ్లీ నేచర్ కనబరుస్తూ.. వారికి అండగా నిలబడాల్సిన పోలీసులు ఒక్కోసారి అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎంతటికైనా తెగిస్తూ ఉంటారు. తాజాగా ఓ కానిస్టేబుల్ స్విగ్గి డెలివరీ బాయ్ ను విచక్షణా రహితంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.

Video Advertisement

ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తమిళనాడులో సింగనల్లూరు పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ కానిస్టేబుల్ రోడ్డుపై వెళుతున్న స్విగ్గి డెలివరీ బాయ్ పై దాడికి దిగాడు.

delivery boy 1

వివరాల్లోకి వెళితే ఆర్డర్ డెలివర్ చేయడానికి రోడ్డుపై వెళ్తున్న డెలివరీ బాయ్ వెనకాల బస్సు వేగంగా వస్తుండడంతో ఓ పక్కగా ఆపాడు. అతివేగంగా వస్తున్న ఈ ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న డెలివరీ బాయ్ తో పాటు మరో వాహనదారుడిని కూడా ఢీ కొట్టబోయింది. దీనితో బైక్ ను పక్కకు ఆపిన డెలివరీ బాయ్ అతివేగం తగదని ప్రైవేట్ బస్ డ్రైవర్ ను హెచ్చరించాడు.

delivery boy

ఈ క్రమంలో అక్కడ కొద్దిగా ట్రాఫిక్ చోటు చేసుకుంది. ఆ ట్రాఫిక్ ను మళ్లించే ప్రయత్నం కూడా చేసాడు. ఈ క్రమంలో అక్కడకి వచ్చిన కానిస్టేబుల్ సదరు డెలివరీ బాయ్ పై చేయి చేసుకున్నాడు. రోడ్డుపై ఏదైనా జరిగింధి మేము చేసుకుంటామని.. ట్రాఫిక్ అయినా అది నీ పని కాదని.. ఆ బస్సు ఎవరిదో తెలుసా..? అంటూ ప్రశ్నించాడు. అంతే కాదు ఆ డెలివరీ బాయ్ ని చెప్పుతో కొట్టాడు. ఇదంతా అక్కడి స్థానికులు రికార్డు చేసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Watch Video:


End of Article

You may also like