ఇటీవల కాలంలో ప్రేమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇవి గాఢమైనవి అయితే నిలబడతాయి. కానీ.. అవసరం కోసం ప్రేమించుకునే వారు.. మోజు తీరిపోయాక వద్దనుకునేవారు ఎక్కువ అవుతున్న కారణంగా.. ఈ ప్రేమ యుద్ధంలో బలిపశువులుగా మారుతున్న వారికి తీవ్ర ఆవేదనే మిగులుతుంది.
ఇటీవల, తాను ప్రేమించిన అబ్బాయి మోసం చేసాడని, తనకు న్యాయం చేయాలనీ.. లేకుంటే ఆత్మహత్యే తనకు శరణ్యమని ఓ అమ్మాయి తన ఆవేదన చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది.
ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈమె స్టోరీ తెలుసుకున్న నెటిజన్లు ఆవేదన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే, ఆసియన్ తెలుగు కధనం ప్రకారం, గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కొత్తపేటకు చెందిన వైష్ణవి అనే అమ్మాయి సాయి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటానని, పెద్దల్ని ఒప్పిస్తానని చెప్పడంతో అతన్ని వైష్ణవి మనసారా నమ్మింది.
తీరా పెళ్లి చేసుకోమని అడగడంతో.. శ్రీనివాస్ మొహం చాటేశాడు. అతని తల్లి తండ్రులు కూడా తనపై దాడి చేసారని చెప్పుకుని వాపోయింది. తనకు న్యాయం చేయాలి అంటూ ఇప్పటికే స్థానిక పోలీసులను, జిల్లా ఎస్పీని కూడా కలిశానని ఆమె వీడియోలో చెప్పుకుంది. శ్రీనివాస్ తో పెళ్లి చేయాలనీ, తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని చెబుతోంది.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని, తనని నమ్మి తనకి సర్వం అర్పించానని, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే మొహం చాటేస్తున్నాడని, నాకు జరిగినట్లు ఏ ఆడపిల్లకి జరగకూడదని చెప్తూ ఈ అమ్మాయి ఆవేదన చెందుతోంది. తనకు ఎలా అయినా న్యాయం జరిగేలా చూడాలని కోరుతోంది. ఆమె పోస్ట్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Watch Video:
https://www.facebook.com/watch?v=1096209821176141



