Ads
రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే.. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే.. అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.
Video Advertisement
కానీ.. సోషల్ మీడియాలో ఎక్కువగా అమ్మాయిలకు డ్రైవింగ్ సరిగ్గా రాదు అన్నట్లు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. అందుకు తగ్గట్లే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అయిపోతోంది.
ఓ ఇద్దరు అమ్మాయిలు స్కూటీ పై వెళ్తూ ఉన్నారు. వారి వెనకే.. ఓ అబ్బాయి బైక్ పై వెళ్తున్నాడు. అయితే.. వెనక బైక్ వెళ్తున్న వ్యక్తి తన ఫోన్ లో రికార్డర్ ఆన్ చేసి డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. ముందు స్కూటీ డ్రైవ్ చేస్తున్న అమ్మాయి ఉన్నట్లుండి పట్టు తప్పి పడిపోయింది. అయితే.. ఆమె వెనుక కూర్చున్న అమ్మాయి మాత్రం తప్పంతా వెనక వచ్చే వ్యక్తిదే అన్నట్లు గొడవకు దిగింది.
అసలు వెనక బైక్ పై వచ్చే వ్యక్తి ముందు ఉన్న స్కూటీ కి దూరంగానే డ్రైవ్ చేస్తున్నాడు. కనీసం టచ్ కూడా చేయలేదు అన్న సంగతి రికార్డెడ్ వీడియో లో స్పష్టం గా కనిపిస్తోంది. అయితే.. ఇదేమీ తెలియని సదరు అమ్మాయి ఈ వ్యక్తితో గొడవకు దిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఈ వీడియోని రికార్డు చేయకపోయి ఉంటె.. ఈ వ్యక్తిని ఎవరూ నమ్మేవారు కాదేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
End of Article