అనుష్కకు విడాకులిచ్చేయ్ విరాట్ అంటూ ఎం.ఎల్.ఏ కామెంట్స్…కారణం ఆ వెబ్ సిరీస్?

అనుష్కకు విడాకులిచ్చేయ్ విరాట్ అంటూ ఎం.ఎల్.ఏ కామెంట్స్…కారణం ఆ వెబ్ సిరీస్?

by Anudeep

Ads

బాలివుడ్ నటి అనుష్క నిర్మాణ సారధ్యంలో ఇటీవల విడుదలైన వెబ్ సిరిస్ “పాతాల్ లోక్” . అమేజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ  వెబ్ సిరిస్.. విడుదలైన కొద్ది రోజులకే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే  అన్ని వర్గాల ప్రేక్షకులనుండి ప్రశంసలు అందుకుంది.. అంతే స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటుంది..పాతాల్ లోక్ ని బ్యాన్ చేయాలంటూ కేస్ ఫైల్ చేశారు బిజెపి మాజీ ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్..అంతేకాదు అనుష్కకి విడాకులిచ్చేయ్ విరాట్ అంటూ కామెంట్ చేశారు..

Video Advertisement

పాతాల్ లోక్ వెబ్ సిరీస్లో ఒక చోట తన  అనుమతి లేకుండా తన ఫోటోని వాడారని అబియోగం మోపారు బిజెపి మాజీ ఎమ్మెల్యే నందకిషోర్.. అదే విషయంపై కేస్ ఫైల్ చేశారు..ఆ సిరిస్లో ఉపయోగించిన ఫోటోని మార్ఫ్ చేసి పెట్టినప్పటికి నందకిషోర్ ముఖం క్లియర్ గా కనపడుతోంది..నన్ను విలన్ గా చూపించారని  ఇదే విషయంపై మండిపడ్డారు.. అంతేకాదు ఈ వెబ్ సిరిస్ దేశంలో మతతత్వ అల్లర్లను ప్రేరేపించే విధంగా ఉందని..వెంటనే దీన్ని బ్యాన్ చేయాలని కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రికి కూడ లేఖ రాశారు.

దేశం కంటే ఎవరూ ఎక్కువ కాదని.. విరాట్ దేశభక్తుడు, ఆయన దేశం తరపున ఆడుతున్నారు..కానీ  అనుష్క దేశద్రోహిలా వ్యవహరించారు..కాబట్టి వెంటనే విరాట్ కొహ్లీ అనుష్కకి విడాకులు ఇవ్వాలని..పేర్కొన్నారు.  మరోవైపు “పాతాళ్‌ లోక్‌” సిరీస్‌పై గోర్ఖా వర్గం వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సన్నివేశంలో గోర్ఖా వర్గాన్ని కించపరిచే సంభాషణలున్నాయంటూ ఆల్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ గోర్ఖా యూత్‌ అసోసియేషన్‌(ఆప్‌గ్యా) అభ్యంతరం వ్యక్తం చేసింది..ఇదే విషయం పై వారు అనుష్కపై జాతీయ మానవహక్కుల కమిషన్ కు కంప్లైంట్ చేశారు.


End of Article

You may also like