Ads
- చిత్రం : విరాట పర్వం
- నటీనటులు : రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరీ రావు.
- నిర్మాత : సుధాకర్ చెరుకూరి
- దర్శకత్వం : వేణు ఉడుగుల
- సంగీతం : సురేష్ బొబ్బిలి
- విడుదల తేదీ : జూన్ 17, 2022
Video Advertisement
స్టోరీ :
సినిమా 1990 సమయంలో నడుస్తుంది. వెన్నెల (సాయి పల్లవి), రవన్న అలియాస్ అరణ్య (రానా దగ్గుబాటి) రచనలు చదివి అతనిపై ప్రేమ పెంచుకుంటుంది. వెన్నెల రవన్నని కలవడానికి బయల్దేరుతుంది. అతని కోసం ప్రతి ఊరు తిరుగుతూ ఉంటుంది. కానీ అదే సమయంలో రవన్న మరొక ఒక సమస్యలో ఇరుక్కొని ఉంటాడు. వెన్నెల రవన్నని కలిసిందా? వెన్నెల ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? రవన్న వెన్నెలను ఇష్టపడతాడా? చివరికి వారిద్దరూ ఏమయ్యారు? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు అనే విషయం ముందు నుండి తెలిసిందే. సినిమా మొదటి నుండి కూడా ఎసినిమాలో చెప్పాలి అనుకున్న పాయింట్ నుండి వేరే పాయింట్ కి వెళ్ళకుండా ఒకటే పాయింట్ మీద నడుస్తుంది. సినిమాలో చాలా మంది నటులు ఉన్నారు. కానీ ఫోకస్ అంతా మాత్రం కేవలం సాయి పల్లవి మీద మాత్రమే ఉంటుంది. సాయి పల్లవి నటిస్తున్నట్టు ఏ ఒక్క సీన్ లో కూడా అనిపించలేదు. నిజంగా వెన్నెల పాత్రలో సాయి పల్లవి జీవించారు ఏమో అనిపిస్తుంది.
వెన్నెల తన ప్రేమని వెతుక్కుంటూ వెళ్లే మధ్యలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది తనకు పరిచయం అయిన వ్యక్తుల వల్ల మనకి మంచి జరిగిందా చెడు జరిగిందా అనే అంశం చుట్టూ సినిమా తిరుగుతుంది. హీరోగా నటించిన రానా దగ్గుబాటి తో పాటు ముఖ్య పాత్రల్లో నటించిన ప్రియమణి, నందితాదాస్, ఈశ్వరీ రావు నవీన్ చంద్ర కూడా తమ పాత్రల్లో బాగా నటించారు. సినిమా అంతా చాలా సీరియస్ గా నడుస్తుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం కొన్ని సీన్స్ నిడివి కొంచెం ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- సాయి పల్లవి
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- సినిమాటోగ్రఫీ
- డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
- నిడివి ఎక్కువగా ఉన్న కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
విరాట పర్వం నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా. సినిమా అంతా కేవలం ఒక పాయింట్ మీద మాత్రమే నడుస్తుంది. కమర్షియల్ అంశాలు ఉన్న సినిమా అయితే కాదు. కానీ ఇటీవల మంచి కథతో వచ్చిన కొన్ని ప్రేక్షకులకి గుర్తుండిపోయే సినిమాల్లో మొదట్లో ఉన్న కొన్ని సినిమాల స్థానంలో విరాట పర్వం నిలుస్తుంది.
End of Article