Ads
డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్, కృతిసనన్ నటించిన సినిమా ‘ఆదిపురుష్’. రిలీజ్ కు ముందు నుండి ఈ చిత్రం విమర్శలకు, వివాదాలకు గురవుతోంది. ఈ చిత్రాన్ని రామాయణం ఆధారంగా రూపొందించిన విషయం తెలిసిందే. జూన్ 16న మూవీ రిలీజ్ అయినప్పటి నుండి ఆదిపురుష్ సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
Video Advertisement
కొందరు ఆదిపురుష్ పై సానుకూలంగా స్పందిస్తుంటే, చాలామంది రామాయణాన్ని ఆదిపురుష్ పేరుతో అపహాస్యం చేస్తున్నారని, ఏ మాత్రం అవగాహన లేకుండా ఈ చిత్రాన్ని తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
హనుమంతుడి డైలాగ్స్ పై తీవ్ర అభ్యంతరం రావడంతో చిత్రబృందం ఆ డైలాగ్స్ ను మార్చిన సంగతి తెలిసిందే. మూవీలోని కొన్ని సన్నివేశాల పట్ల మండిపడుతున్నారు. ముఖ్యంగా రావణుడి పాత్ర తీరు పై విమర్శలు చేస్తున్నారు. ఈ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇక ఇంద్రజిత్ సీతాదేవి గొంతు కోసినట్టు ఒక సీన్ లో చూపించారు. ఇది ఫిక్షన్. కొందరు రాజకీయ నేతలు ఏవేవో ఊహించుకుని రామాయణం మార్చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ సినిమా పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. “ఆదిపురుష్ మూవీ చూసిన అనంతరం బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అర్థమైందంటూ” ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ ట్వీట్ పై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్ పై సెహ్వాగ్‌ను కొందరు ట్రోల్ చేస్తుంటే, కొందరు కాస్త బెటర్‌గా తీయాల్సింది అని సెహ్వాగ్ కు మద్ధతిస్తున్నారు.ప్రభాస్ అభిమానులు సెహ్వాగ్ చేసిన కామెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ మూవీని అంగీకరించినందుకే బాహుబలి (ప్రభాస్)ను కట్టప్ప చంపాడు అనే అర్థంతో ఈ ట్వీట్ చేశారని ప్రభాస్ అభిమానులు సెహ్వాగ్ పై ఫైర్ అవుతున్నారు. అరె మీరూ మొదలుపెట్టారా అంటూ అభిమానులు తిట్టిపోస్తున్నారు.
End of Article