విశాఖపట్నం కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. పోలీసులు ముందు రమేష్ మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆ క్రమంలో ప్రియుడితో కలిసి బ్రతకడం కోసం రమేష్‌ను అతని భార్య శివాని మర్డర్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే తాజాగా రమేష్ కేసులో ఒక కొత్త పేరు బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
విశాఖలోని వన్‌టౌన్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్ మర్డర్ కేసులో వీడియో లభించిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియో చూసిన పోలీసులు, రమేష్ వైఫ్ తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. లవర్ రామారావుతో కలిసి రమేష్ భార్య మంగళవారం రాత్రి భర్తను ఊపిరాడకుండా చేసి చంపేసిన సంగతి తెలిసిందే. అయితే రమేష్ ను చంపడం కోసం ముందుగానే తన లవర్ తో కలిసి శివాని కుట్ర పన్నింది. హత్య విషయంలో తన పై సందేహం రాకుండా హత్య చేయకముందే రమేష్ తో చాలా ప్రేమగా ఉన్నట్లు వీడియో తీసింది.
మంగళవారం నాడు రాత్రి మటన్ కర్రీ చేసి, భర్తకు పెట్టి, మద్యం తాగించింది. తాను చాలా మంచిదని, మై వైఫ్, మై లైఫ్ అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డు చేసింది. ఆ తరువాత మద్యం మత్తులో ఉన్న భర్తను తీసుకెళ్ళి బెడ్ పై పడుకోబెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మర్దర్ కేసు తనపై పడకుండా ఉండడం కోసమే, తాను మంచిదాన్ని అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డ్ చేసినట్లు శివాని పోలీసులు ఎదుట ఒప్పుకుంది. దీంతో శివాని తెలివితేటలకు అందరూ షాక్ అవుతున్నారు.
విచారణలో శివాని తనకు పెద్దమ్మ కూతురు పైడమ్మ వల్లే రామారావుతో పరిచయం అయ్యిందని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో రమేష్ మర్డర్ ఈ హత్య కేసులో పైడమ్మ హస్తం కూడా ఉందని శివాని పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించిందని సమాచారం. ఇక ఈ కేసులో ప్రస్తుతం రమేష్ భార్య శివాని, ఆమె లవర్ రామారావు, మరియు అతని ఫ్రెండ్ నీలా మీద మాత్రమే కేసును నమోదు చేశామని పోలీసులు తెలిపినట్లు సమాచారం.
Also Read: “నాన్న వచ్చాడు..!” అని సంతోషంగా చెప్పింది… కానీ చివరికి..? వెలుగులోకి వచ్చిన వింత సంఘటన..!