విశాఖలో జరిగిన విషాద సంఘటన విజువల్స్…ఈ 20 ఫోటోలు చూస్తే కన్నీళ్లాగట్లేదు!

విశాఖలో జరిగిన విషాద సంఘటన విజువల్స్…ఈ 20 ఫోటోలు చూస్తే కన్నీళ్లాగట్లేదు!

by Sainath Gopi

Ads

ఒకవైపు ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తుంటే , ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా వాసులకు మరో ఘటన కుదిపేసింది..ఎప్పుడు ఎక్కడ కరోనా ఎవరికి సోకుతుందో తెలియక భయపడుతూ , బిక్కు బిక్కుమంటూ పడుకున్న ప్రజలను , నిద్రలో ఉండగానే మృత్యువు మరో రూపంలో కబలించింది.  ఎక్కడి జనం అక్కడ కుప్పకూలిపోతున్నారు, జంతువులు గిలగిల కొట్టుకుంటూ చనిపోతున్నాయి.ఇంతకీ వైజాగ్లో  ఏం జరిగింది?ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది??

Video Advertisement

తెల్లవారుఝామున 4గంటలకు

విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమలో తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడిన సంగతి తెలిసిందే.ఈ రోజు పరిశ్రమ తెరిచే ప్రయత్నం జరిగిందని సమాచారం. ఆ క్రమంలో పరిశ్రమలో ప్రమాదం సంభవించి భారీగా రసాయన వాయువు లీక్ అవ్వడంతో 3 కిలోమీటర్ల​ మేర గ్యాస్ వ్యాపించింది. లీకైన గ్యాస్ ని స్టెరీన్ గా గుర్తించారు..పాలిమర్స్ తయారిలో ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

భయంతో పరుగులు పెట్టిన జనం

పరిశ్రమ చుట్టుపక్కల సుమారు ఆరు గ్రామాల వరకు ఉంటాయి.. అందరూ నిద్రలో ఉండడం లీకైన గ్యాస్ పీల్చడంతో స్థానికులు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు.ఈ గ్యాస్ కి పీల్చిన వారు ఎక్కడిక్కడ కుప్పకూలిపోవడంతో అధికారులు అప్రమత్తమయి సైరన్ మోగించారు..పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు కొట్టి ప్రజలను నిద్రలేపారు. సుమారు మూడు కి,మీ మేర గ్యాస్ వ్యాపించడంతో రోడ్లపైన ఎక్కడిక్కడ జనం కుప్పకూలిపోయారు.  చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువగా ప్రమాదానికి గురైన ఈ ఘటనలో ఇప్పటివరకు 10మరణాలు సంభంవించాయి . సుమారు వందల సంఖ్యలో జనం స్పృహ తప్పిపడిపోయారు.

అంబులెన్సులు, బస్సులలో హాస్పిటల్ కి తరలింపు

కరోనా చికిత్స కోసం కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్లు, ఆ ఏరియాకు దగ్గరలో ఉన్న సింహాచలం బస్ డిపో నుండి బస్సులను రప్పించి ప్రమాదానికి గురైన వారిని  హుటాహుటిన కెజిఎచ్ కి తరలించారు.. కరోనా పేషెంట్స్ కోసం ముందస్తుగా ఏర్పాటు చేసిన  వైద్య సదుపాయాలు, వెంటిలేటర్లు ఏర్పాటు చేయడంతో,  వందల సంఖ్యలో వస్తున్న జనానికి వైద్యం అందించడం, వెంటిలేటర్లు ఏర్పాటు చేయడం కొద్దిగా సులువయింది.

గ్రామాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు

పరిశ్రమకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి వసతి ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ప్రజలు కూడా ఇల్లు ఖాళీ చేసి దూరప్రాంతాల్లో ఉన్న బంధువుల ఇళ్లకు చేరుకుంటున్నారు. సుమారు 20వేల మందికి పైగా జనం ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇంటికి చేరుకున్నట్టు సమాచారం.. ప్రస్తుతం చుట్టూ ఉన్న గ్రామాలను ఖాళీ చేయించే పనిలో యంత్రాంగం ఉంది.

images source: sakshi


End of Article

You may also like