Ads
చేసేది తమిళ్ సినిమాలు అయినా కూడా, ప్రతి సినిమాని తెలుగులో డబ్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న నటుడు విశాల్. దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకొని, తర్వాత నటుడిగా కూడా ఎదిగి, అటు నెగిటివ్ పాత్రలు, ఇటు హీరో పాత్రలు కూడా చేస్తూ ఫేమస్ అయిన నటుడు ఎస్ జె సూర్య. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా మార్క్ ఆంథోనీ. ఈ సినిమా ఇవాళ తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : మార్క్ ఆంథోనీ
- నటీనటులు : విశాల్, S.J.సూర్య, సునీల్, సెల్వరాఘవన్, రీతూ వర్మ, అభినయ, రెడిన్ కింగ్స్లే, Y.G.మహేంద్రన్.
- నిర్మాత : ఎస్. వినోద్ కుమార్
- దర్శకత్వం : అధిక్ రవిచంద్రన్
- సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్
- విడుదల తేదీ : సెప్టెంబర్ 15, 2023
స్టోరీ :
మార్క్ (విశాల్) ఒక మెకానిక్. మార్క్ తండ్రి ఒక పేరు మోసిన గ్యాంగ్‌స్టర్. ఒక రోజు మార్క్ ఒక టైం ట్రావెలింగ్ పరికరాన్ని చూస్తాడు. దీని సహాయంతో విడిపోయిన తల్లిని కలుసుకోవాలి అని అనుకుంటాడు. ఈ క్రమంలో ఎన్నో ప్రమాదకరమైన సంఘటనలు ఎదుర్కొంటాడు. తన కుటుంబం గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటాడు.
పైకి సాధారణంగా కనిపించిన వారిలో ఒక కోణం కూడా దాగి ఉంది అని అర్థం చేసుకోగలుగుతాడు. అసలు మార్క్ టైం ట్రావెలింగ్ మిషన్ ద్వారా ఏ కాలానికి వెళ్ళాడు? అక్కడ ఎటువంటి సంఘటనలు చూశాడు? తన తల్లిని కలుసుకున్నాడా? మార్క్ ఆంథోనీని ఎలా కలుస్తాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
టైం ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులో కూడా ఆదిత్య 369 వంటి సినిమాలు టైం ట్రావెలింగ్ వచ్చాయి. ఈ కాన్సెప్ట్ కి చాలా క్రేజ్ ఉంది. ఇటీవల వచ్చిన ఒకే ఒక జీవితం కూడా ఇదే కాన్సెప్ట్ కి చెందినది. ఇప్పుడు టైం ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్ కి కాస్త కొత్తదనాన్ని యాడ్ చేసి కొన్ని ఎమోషన్స్ కూడా ఉండేలాగా తీసిన సినిమా మార్క్ ఆంథోనీ. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా కూడా ప్రేక్షకులకి చాలా వరకు తెలుస్తూ ఉంటుంది.
దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగుంది. కానీ దాన్ని తెరమీద చూపించే క్రమంలో కొన్ని పొరపాట్లు అయితే జరిగాయి. కొన్నిచోట్ల చాలా కాంప్లెక్స్ గా అనిపిస్తుంది. కానీ అవన్నీ కూడా ప్రేక్షకులకి బోర్ కొట్టించవు. టేకింగ్ పరంగా సినిమా చాలా బలంగా ఉంది. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విశాల్ చాలా బాగా నటించారు. ఒక రకంగా చెప్పాలి అంటే విశాల్ కి ఇది మరొక ఎక్స్పరిమెంటల్ సినిమా అయ్యింది. ఎస్ జె సూర్య కూడా తన పాత్రలో తాను బాగా నటించారు.
ఒక రకమైన స్టైల్ తో ఉన్న డబ్బింగ్ తో పాత్రకి ఇంకా కొత్తదనాన్ని తెచ్చారు. అలాగే హీరో తల్లిగా నటించిన అభినయ కూడా తన పాత్ర వరకు తాను బాగా నటించారు. రీతు వర్మకి నటనకి ఆస్కారం ఉన్న పాత్ర దొరకలేదు. తనకిచ్చిన పాత్ర వరకు తను చేశారు అంతే. రెడిన్ కింగ్స్లే కామెడీ బాగుంది. అంతే కాకుండా సిల్క్ స్మిత లాగానే కనిపించే విష్ణు ప్రియ సిల్క్ స్మిత పాత్ర పోషించారు. దాంతో ఆ కాలాన్ని తెరపై చూపించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం బాగా అనిపిస్తుంది.
పాటలు కూడా గుర్తు పెట్టుకునే అంత గొప్పగా కాకపోయినా సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి అంతే. టెక్నికల్ గా సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ నుండి, సెట్టింగ్స్ వరకు సినిమా చూస్తున్నంత సేపు ఒక రెట్రో స్టైల్ తీసుకురావడానికి ప్రయత్నించారు. అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, అలాగే నటీనటులు వేసుకునే కాస్ట్యూమ్స్ కూడా అచ్చం అప్పటి కాలాన్ని చూపించే విధంగా ఉన్నాయి.
ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. కానీ సినిమాలో ఉన్న కాంప్లెక్సిటీ వల్ల సినిమా అందరికీ నచ్చే అవకాశం తక్కువ. ఎక్స్పరిమెంటల్ సినిమాలు ఇష్టపడే వారికి అయితే నచ్చుతుంది. కానీ చాలా మంది ప్రేక్షకులు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలని చూడాలి అని, లేదా ఒక మంచి ఎంటర్టైనర్ చూడాలి అని అనుకుంటారు. కానీ వాళ్లకి మాత్రం ఇది అంత పెద్దగా ఆకట్టుకునే అవకాశం లేదు.
ప్లస్ పాయింట్స్ :
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్
- నటీనటులు
- ప్రొడక్షన్ డిజైన్
- అక్కడక్కడ వర్కౌట్ అయిన కామెడీ
మైనస్ పాయింట్స్:
- కాంప్లెక్స్ గా ఉన్న స్క్రీన్ ప్లే
- ల్యాగ్ అనిపించే కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
టైం ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్ మీద వచ్చిన మరొక ప్రయోగాత్మక సినిమా ఇది. ఇలాంటి సినిమాలను ఇష్టపడే వారిని ఈ సినిమా అస్సలు డిసప్పాయింట్ చేయదు. కానీ ఈ జోనర్ అంత పెద్దగా నచ్చని వారికి ఈ సినిమా ఒక్క సారి చూడొచ్చు. ఒక కొత్త పాయింట్ ఉన్న కాన్సెప్ట్ తో మార్క్ ఆంథోనీ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ గా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “బేబీ” సినిమా మీద సీరియస్ అయిన కమిషనర్..! అసలు విషయం ఏంటంటే..?
End of Article