ఇటీవల రిలీజ్ అయిన ‘బేబీ’ సినిమా భారీ వసూళ్లను సంపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమైనది.

Video Advertisement

బస్తీ నుంచి వెళ్లిన హీరోయిన్ రిచ్ లైఫ్, మందు, డ్ర-గ్స్‌కి అలవాటు జీవితంలో ఏం కోల్పోతుందో అనే విషయాన్ని ఈ సినిమాలో తెలియజేశారు.

అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ డ్ర-గ్స్‌ తీసుకోమని ప్రోత్సహించేలా ఉన్నాయని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. అయితే బేబీ టీమ్‌కు సీపీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని డైరక్టర్ సాయి రాజేష్ తెలిపారు. కొన్ని డ్ర-గ్స్‌ సీన్స్ తొలగించాలని లేదా బ్లర్ చేయమని సీపీ ఆఫీస్ వాళ్లు తెలిపారని డైరక్టర్ అన్నారు.

కానీ ఇప్పుడు ఆ సీన్స్ తొలగించలేమని సాయి రాజేష్ అన్నారు. డ్ర-గ్స్‌ తీసుకోమని సినిమా తీయలేదు. డ్ర-గ్స్‌ తీసుకుని.. జీవితం పాడుచేసుకోవద్దని ఈ సినిమా తీశామని డైరక్టర్ తెలిపారు. కానీ ఈ సినిమాలో డ్ర-గ్స్‌ ఏ విధంగా వాడాలో అని సీన్స్ ఉన్నాయని.. ఇలాంటి సీన్లు ఇకపై ఎవరూ కూడా తీయద్దని సినిమా రంగానికి సీవీ ఆనంద్ కోరారు.

ఇంక సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి చాలా మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. సినిమా రిలీజ్ కి ముందే రిలీజ్ అయిన పాటలు ఆల్రెడీ అప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యాయి. దాంతో సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చూపించారు అని దర్శకుడిని అందరూ మెచ్చుకున్నారు.

తెలిసి తెలియక యువత చేసే కొన్ని తప్పుల గురించి, వాటి వల్ల వాళ్లు ఎదుర్కొనే సంఘటనల గురించి ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాపై విమర్శలు వచ్చినా కానీ అంతకంటే ఎక్కువగా కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఎంతోమంది విమర్శకులు ఈ సినిమాని ప్రశంసించారు. హీరో హీరోయిన్ అంటే కేవలం మంచి పనులు మాత్రమే చేస్తారు అని కాకుండా వారు కూడా తప్పులు చేస్తారు అని చూపించిన సినిమాలు చాలా తక్కువ. ఈ సినిమా కూడా అలాంటిదే అని అన్నారు. రియాలిటీ కి చాలా దగ్గరగా ఉంది అని అందరూ అన్నారు.