Punith: “పునీత్” కి మాటిస్తున్నా.. ఇకపై వారి బాధ్యత నాదే..!

Punith: “పునీత్” కి మాటిస్తున్నా.. ఇకపై వారి బాధ్యత నాదే..!

by Anudeep

Ads

కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటు కారణంగా మరణించారు. పునీత్ కి కేవలం కన్నడలో ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. గత శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆస్పత్రికి వెళ్లే సరికి పునీత్ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. చికిత్స అందించిన కొంతసేపటి తర్వాత పునీత్ తుది శ్వాస విడిచారు.

Video Advertisement

vishal

పునీత్ ఇకలేరు అన్న విషయాన్ని యావత్ కర్ణాటక ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో స్వచ్ఛంద స్కూల్స్ ను, గోశాలలను, అనాధ ఆశ్రమాలను నడుపుతున్నారు. ఇందులో భాగంగానే పునీత్ 1800 ల మంది విద్యార్థులను తన సొంత ఖర్చుతో చదివిస్తున్నారు. ఇకపై ఈ 1800 మంది విద్యార్థుల బాధ్యతను తాను తీసుకుంటానని.. వారిని తాను చదివిస్తానని హీరో విశాల్ ముందుకొచ్చారు. అతని ఆలోచనపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


End of Article

You may also like