“సిల్క్ స్మిత” మళ్లీ పుట్టిందేమో అనిపిస్తున్నట్టు ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

“సిల్క్ స్మిత” మళ్లీ పుట్టిందేమో అనిపిస్తున్నట్టు ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by kavitha

Ads

సిల్క్ స్మిత, ఈ పేరును తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు  ఇండస్ట్రీలో ఆమె సంచలనం. అప్పట్లో ప్రతి చిత్రంలోనూ సిల్క్ ప్రత్యేక పాట ఉండాల్సిందే అనే రేంజ్ కి వెళ్ళింది.

Video Advertisement

ఇటీవల రిలీజ్ అయిన దసరా మూవీలో కనిపించిన సిల్క్ స్మిత పోస్టర్ తో మరోసారి ఆమె లైఫ్ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా సిల్క్ స్మిత లాగే ఉన్న ఓ అమ్మాయి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిల్క్ స్మిత మళ్ళి పుట్టిందేమో అనిపిస్తున్నట్టు ఉన్న ఆమె ఎవరో? ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సిల్క్ స్మిత ఎలాంటి సినినేపథ్యం లేకుండా మేకప్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి, స్టార్ గా ఓ వెలుగు వెలిగారు. సిల్క్ స్మిత తన నిషా కళ్లతో ఆడియెన్స్ ని మాయలో పడేసింది. అప్పట్లోనే గ్లామర్ రోల్స్ లో నటించింది. స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసేవారంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ తెలుగు ఆడియెన్స్ మనసుల్లో ఆమె అలాగే ఉండిపోయింది. దశాబ్దం పాటు ఇండస్ట్రీలో వందలాది సినిమాలలో నటించిన ఆమె, చివరకు బలవన్మరణానికి పాల్పడి, కన్నుమూసింది. ఆమె మరణం చాలా మందిని కలిచివేసింది.
అయితే ఆమె మరణించిన తరువాత ఇండస్ట్రీ నుండి ఒక్క హీరో కానీ, డైరెక్టర్స్, నిర్మాతలు ఎవరు వెళ్లలేదు. ఆఖరికి ఆమె కుటుంబసభ్యులు కూడా సిల్క్ స్మితను చూడాటానికి వెళ్లలేదు. దాంతో సిల్క్ స్మితకు అనాథ శవంలా అంతిమ సంస్కారాలు చేశారు. అయితే ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో సిల్క్ స్మిత అందాల తారగా నిలిచిపోయింది. ఇటీవల రిలీజ్ అయిన దసరా మూవీలో కనిపించిన సిల్క్ స్మిత పోస్టర్ తో ఆమె జీవితం వార్తల్లో నిలిచింది.
అచ్చం సిల్క్ స్మిత లాగే కనిపిస్తున్న ఒక అమ్మాయి ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఆమెను ఫ్యాన్స్ జూనియర్ సిల్క్ స్మిత అని పిలుస్తున్నారు. ఆమె పేరు విష్ణు ప్రియ. ఫేస్ మాత్రమే కాకుండా ఎక్స్‌ప్రెషన్స్‌తో సైతం ఆమె సిల్క్‌ స్మితను గుర్తు చేస్తుంది. అంతే కాకుండా విష్ణుప్రియ సిల్క్ స్మిత సాంగ్స్ కు రీల్స్ చేస్తూ నెట్టింట్లో సందడి చేస్తోంది. విష్ణు ప్రియ జూనియర్ సిల్క్ గా పాపులర్ అయ్యింది.

https://www.instagram.com/p/CrQZhLLgqDQ/?hl=en

Also Read: RR VS RRR … కౌంటర్ అదిరిపోయింది కదా..? అసలు ఏం జరిగిందంటే..??


End of Article

You may also like