గతేడాది రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో మంచి ప్రదర్శనతో అదరగొడుతోంది. ఆర్ ఆర్ జట్టు అద్భుతమైన బాటింగ్ తో పాటు, అత్యుత్తమమైన బౌలింగ్ తో పటిష్టంగా ఉంది. రాజస్థాన్ ఓపెనర్, కెప్టెన్ సంజు శాంసన్ ఈ సీజన్ లో జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నారు.
Video Advertisement
అయితే నిన్న జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో చివరి బంతి వరకు ఉత్కంఠ గా మారి హైదరాబాద్ జట్టు గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో ఆర్ ఆర్ ఆటగాళ్లు సంజు సాంసన్, బట్లర్ చెలరేగిపోయారు. ఈ నేపథ్యం లో సంజు సాంసన్ బాగా ఆడాడంటూ రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ పేజీ లో “SSS (స్కిప్పర్ సంజు సాంసన్) > ఆర్ఆర్ఆర్” అంటూ పోస్ట్ పెట్టారు.
అంటే RRR కంటే సంజు సాంసన్ గొప్ప అన్నట్టు ఆ పోస్ట్ లో ఉండటం తో నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే ఈ ట్వీట్ కి వెంటనే రిప్లై ఇచ్చింది డీవీవీ ఎంటెర్టైమెంట్. “ఫాన్స్ ..బిల్డప్పులు అంటూ” ఒక మూవీ లోని ఫన్నీ సీన్ ని రిప్లై గా ఇచ్చింది. ఆ తర్వాత ఆ పోస్ట్ కి RRR మూవీ ట్విట్టర్ పేజీ నుంచి ఒక రిప్లై వచ్చింది. అయితే జిఫ్ ఫైల్స్ తో, మీమ్ టెంప్లేట్ తో రిప్లై ఇచ్చింది RRR మూవీ.
అయితే వెంటనే రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ పేజీ సర్దుబాటు చర్యలకు పూనుకొని “ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచం మొత్తానికి ఎలా చేరిందో.. మా క్షమాపణ కూడా అలాగే చేరుతుందని ఆశిస్తున్నాం.. మేము RRR , SSS ని ఒకేలా ప్రేమిస్తాం.” అని రిప్లై ఇవ్వగా.. RRR మూవీ మరో మీమ్ టెంప్లేట్ తో రిప్లై ఇచ్చింది.
ట్విట్టర్ లో జరిగిన ఈ కన్వెర్జేషన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఈ వార్ ఊహించలేదుగా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిపోయి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది.