Ads
ఎవరైనా ఒక పనికి మించి ఎక్కువ పనులు చేస్తే మల్టీ టాలెంటెడ్ అని అంటారు. ఈ మాట ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో వినపడుతూ ఉంటుంది. ఎందుకంటే నటులుగా చేసేవారు డైరెక్టర్లు అవుతూ ఉంటారు, డైరెక్టర్లుగా చేసేవారు నటులవుతూ ఉంటారు. ఒక్కొక్కరిలో ఎన్నో రకాల టాలెంట్ లు ఉంటా ఉంటాయి. అది సమయం వచ్చినప్పుడు బయట పెడుతూ ఉంటారు.
Video Advertisement
అయితే ఇప్పుడు యంగ్ హీరో విశ్వక్ సేన్ తనలోని మల్టీ టాలెంట్ ను బయటపెడుతున్నారు. వెళ్ళిపోమాకే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస పెట్టిన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పరుచుకున్నారు. ఫలక్ నామ దాస్ సినిమాతో సొంతంగా డైరెక్టర్ గా తానే హీరోగా సూపర్ హిట్ ను అందుకున్నారు.
తర్వాత దాస్ కా ధమ్కి సినిమాతో మరోసారి తన లోని డైరెక్షన్ టాలెంట్ పెట్టారు. అయితే ఇప్పుడు నిర్మాతగా అవతారం ఎత్తనున్నారు విశ్వక్ సేన్. 20 మంది కొత్త వాళ్లను తెలుగు పరిచయం చేస్తూ కల్ట్ అనే మూవీని ప్రకటించారు. ఈ మూవీ త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. సే నో టు డ్ర-గ్స్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే రైటర్. తాజుదీన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు
End of Article