Ads
- చిత్రం : ఓరి దేవుడా
- నటీనటులు : విశ్వక్ సేన్, వెంకటేష్, మిథిలా పాల్కర్, ఆశా భట్.
- నిర్మాత : పెర్ల్ పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి (PVP సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
- దర్శకత్వం : అశ్వత్ మారిముత్తు
- సంగీతం : లియోన్ జేమ్స్
- విడుదల తేదీ : అక్టోబర్ 21, 2022
Video Advertisement
స్టోరీ :
అర్జున్ దుర్గరాజు (విశ్వక్ సేన్), అను పాల్‌రాజ్ (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు.పెళ్లి అయిన కొంత కాలానికే విడిపోవాలని నిర్ణయించుకుంటారు ఈ జంట.. తర్వాత వారి జీవితాల్లోకి దేవుడు వచ్చాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వారి సమస్యలను దేవుడు ఎలా పరిష్కరించాడు అన్నదే ఈ సినిమా కథ.
రివ్యూ :
యూత్ ను ఎక్కువగా టార్గెట్ చేసుకుని యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ మాస్ పల్స్ పట్టుకుని సినిమాలు చేస్తూ వచ్చిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు కాస్త రూట్ మార్చాడు. కాస్త క్లాస్ ఏలిమెంట్స్ తో.. డిఫరెంట్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకుని ఓరీ దేవుడా సినిమా చేశాడు. తమిళంలో సంచలన విజయం సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాకు ఇది రీమేక్. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన దేవుడు పాత్రను తెలుగులో విక్టరీ వెంకటేష్ చేస్తుండటం విశేషం.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తన ఇమేజ్ కు సరిపడిన కథ ఇది. మూవీ చూసిన ఆడియన్స్ హీరో యాక్టింగ్ కు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించాడు.
విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించి మెప్పించారు. హీరోయిన్ మిథిలా పార్కర్ సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ముందుగానే తెలుసు. ఈ చిత్రం లో తన పాత్ర పరిధి మేరకు నటించింది. రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ తదితరులు వారి పాత్రలకు న్యాయం చేసారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ అతిథి పాత్రలో కనిపించి సర్ ప్రైజ్ చేశారు.
తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు తెలుగులోనూ తెరకెక్కించారు. ఇనెమ స్క్రీన్ ప్లే బావుంది. పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచుతోంది. సినిమాటోగ్రఫీ అద్భుతం గా ఉంది. కాకపోతే సినిమా అక్కడక్క డా సాగుతూ బోర్ కొట్టిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- ప్రధాన పాత్రల్లో నటీనటుల నటన
- బాక్గ్రౌండ్ మ్యూజిక్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- హీరో లవ్ ట్రాక్
- సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు
రేటింగ్ :
2.5 /5
ట్యాగ్ లైన్ :
కాస్త సరదాగా సాగిన రొమాంటిక్ మూవీ ఈ ‘ ఓరి దేవుడా’. క్లాస్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది. ఒక్క సారి చూడదగ్గ సినిమా.
End of Article