ముగిసిన వైజాగ్ “సాయి ప్రియ” ఎపిసోడ్..! శ్రీనివాస్ రాకపోవడంతో పోలీసులు ఏం చేశారంటే..?

ముగిసిన వైజాగ్ “సాయి ప్రియ” ఎపిసోడ్..! శ్రీనివాస్ రాకపోవడంతో పోలీసులు ఏం చేశారంటే..?

by Anudeep

Ads

మొన్న విశాఖపట్నం ఆర్కేబీచ్‌లో గల్లంతయ్యారు అని భావించిన సాయి ప్రియ, ఆ తర్వాత నెల్లూరులో ప్రియుడి దగ్గర ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే అదే సమయంలో సాయి ప్రియ తన తండ్రికి వాట్సప్ వాయిస్ మెసేజులు పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Video Advertisement

ఈ మేసేజులు పంపడానికి రెండు రోజుల ముందు, అంటే జులై 25న సాయి ప్రియ, శ్రీనివాసరావుల పెళ్లి రోజు. ఆ రోజు సాయంత్రం ఆర్కే బీచ్‌కు భార్యభర్తలు వచ్చారు. కాసేపు అక్కడ గడిపి, తిరిగి ఇంటికి వెళ్దామనుకునేసరికి సాయి ప్రియ కనిపించలేదు. తన భార్య కనిపించడం లేదంటూ శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కూడా ప్రారంభించారు.

 

 

చివరికి ఆమె కర్ణాటకలోని బెంగళూరులో ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. బుధవారం రాత్రి సాయి ప్రియ తన తండ్రికి వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లు పంపింది. రవితో తాను బెంగళూరులో క్షేమంగానే ఉన్నానని.. తన కోసం వెతకొద్దని సాయి ప్రియ వాయిస్ మెసేజ్‌లో వెల్లడించింది. రవితో ఇష్టపూర్వకంగానే వెళ్లానని.. తన కోసం వెతికితే చనిపోతానని హెచ్చరించింది. చివరకు పోలీసులు ఆమెను విశాఖకు తీసుకొచ్చారు.

 

దీంతో విశాఖ సాయి ప్రియ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడిపోయింది. సాయి ప్రియను ప్రియుడితో పంపించేశారు. ఆమె భర్త శ్రీనివాస్ పోలీస్ స్టేషన్‌కు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సాయి ప్రియ మేజర్ కావడంతో ఆమె ఇష్టం మేరకు ప్రియుడితో వెళ్ళింది. శ్రీనివాస్‌తో పెళ్లి ఇష్టం లేదని చెప్పానని.. చిన్నప్పటి నుంచి నేను రవిని ఇష్ట పడ్డానన్నాని తెలిపింది. తమను బ్రతకనివ్వాలని.. తాను చదువుకున్నానని, ఉద్యోగం చేసి సాయి ప్రియను పోషిస్తానని ప్రియుడు రవి అంటున్నాడు. తమ వలన ఇబ్బంది పడిన వారందరికీ సాయిప్రియ, రవి క్షమాపణలు చెప్పారు.

 

 

శ్రీనివాస్ పెళ్లి రోజు గిఫ్ట్ గా ఇచ్చిన బంగారు గాజులు ఆయనకే ఇచ్చేస్తానన్నారు. ఆ గాజులను అమ్మలేదని.. తమ వద్దే ఉన్నాయని వారు చూపించారు. ముందుగా కుమార్తె సాయి ప్రియతో తల్లిదండ్రులు మాట్లాడారు.. తమ పరువు తీశావని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను రవితో ఉంటానని ఆమె తేల్చి చెప్పింది.. తమ వల్ల ప్రభుత్వానికి కోటి రూపాయలు ఖర్చయినందుకు క్షమించమని వేడుకున్నారు.


End of Article

You may also like