Home Filmy Adda సీరియల్ నటిని రెండో పెళ్లి చేసుకున్న నిర్మాత….. పిల్లల విషయంలో ఆమె పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా?

సీరియల్ నటిని రెండో పెళ్లి చేసుకున్న నిర్మాత….. పిల్లల విషయంలో ఆమె పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా?

by Anudeep

ఓ వారం రోజుల నుంచి వీజే మహాలక్ష్మి, తమిళ్‌ నిర్మాత రవిందర్‌ చంద్రశేఖర్‌ పెళ్లి వార్త, ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియా లో బాగా పాపులర్ అయ్యాయి.
రవీంధర్ సోషల్ మీడియాలో తన పెళ్లి చిత్రాలతో పంచుకున్నారు. అంతే కాదు “‘మహాలక్ష్మి’ లాంటి అమ్మాయి దొరికితే చాలు అని గొప్పగా చెబుతారు, కానీ నాకు నిజం గా మహాలక్ష్మి దొరికింది?” అని పోస్ట్ చేశారు.

సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ చానెల్స్‌లో ఈ జంట పెళ్లి వార్తలు ఈ మధ్య జోరుగా ప్రచారం అయ్యాయి. అంతేకాకుండా ఈ జంట ఎదుర్కొన్నంత బాడీ షేమింగ్‌ ఈ మధ్యకాలంలో ఎవరు ఫేస్‌ చేసి ఉండరు. ఆ వీడియోస్ ఫోటోస్ చూసి చాలా మంది కేవలం అతని డబ్బు కోసం ఆశపడి మాత్రమే మహాలక్ష్మి ఈ వివాహం చేసుకుందని ట్రోల్‌ చేశారు. ఈ విషయంపై రవీంద్ర చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు.

VJ Mahalakshmi marriage Producer Ravindar Chandrasekaran : VJ Mahalakshmi marriage : கணவர் பற்றி மகாலட்சுமி சொன்ன வார்த்தைகள்! - VJ Mahalakshmi marriage Producer Ravindar Chandrasekaran marries serial actress ...

ఇలాంటి వీడియోలు వార్తలు తాము కూడా చాలా చదివామని. కానీ ఎవరో ఏదో అనుకున్నారని బాధపడాల్సిన అవసరం తమకు లేదు అని ఆయన చెప్పారు. వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం అని, ఇద్దరూ పరస్పరం ఇష్టపడిన తర్వాతే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నారు.

actress mahalakshmi marriage photos - DailySportGame

ఈ ఇద్దరికి ఇది రెండో వివాహమే. ఈ పెళ్లికి ముందు మహాలక్ష్మి మొదటి భర్త అనిల్ కుమార్ నుంచి 2019 లో విడాకులు తీసుకుంది. ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. రవీంద్ర కూడా తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు దారి తీసింది. కొన్ని రోజుల క్రితం అత్యంత సమీప బంధువుల సమక్షంలో తిరుపతిలో వీరి వివాహం జరిగింది.

VJ Mahalakshmi: With the actress's husband before Ravindra… Mahalakshmi's romance before Ravindra! – Mahalakshmi's gossiped with serial

పెళ్లి తర్వాత వరస ఇంటర్వ్యూలతో బాగా పాపులర్ అవ్వడంతో ఈ జంట బిజీగా ఉన్నారు. అయితే ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీంద్ర పెళ్లికి ముందు మహాలక్ష్మి తనకు పెట్టిన కండిషన్ గురించి ప్రస్తావించారు. పిల్లల విషయంలో మహాలక్ష్మి అతనికి ఒక కండిషన్ పెట్టిందని ఆయన పేర్కొన్నారు.అదేమిటో అనుకుంటున్నారా….. మహాలక్ష్మికి ఆల్రెడీ ఒక కొడుకు ఉన్నాడు. కానీ ఆమె మళ్లీ పిల్లలను కంటాను అని రవీంద్ర కి చెప్పిందట. దానికి రవీంద్ర కూడా ఒప్పుకున్నారట.

 

You may also like