కరోనా కాలర్ ట్యూన్ వాయిస్ ఈమెదే

కరోనా కాలర్ ట్యూన్ వాయిస్ ఈమెదే

by Anudeep

దేశంలో కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించారు.. లాక్ డౌన్ ప్రకటించడానికి ముందే అందరి ఫోన్స్ కాలర్ ట్యూన్స్ ని ఛేంజ్ చేశారు.. టెలికాం కంపెనిల మ్యూజిక్ యాప్స్ ఫ్రీగా కాలర్ ట్యూన్స్ అందించడంతో చాలామంది ఎవరికి ఇష్టం అయిన పాటలని వారు కాలర్ ట్యూన్స్ గా పెట్టుకున్నారు.కాని ఒక్కసారిగా దేశం మొత్తం అందరి ఫోన్ కాలర్ ట్యూన్స్ ఛేంజ్ అయిపోయి వాటి స్థానంలో ఖల్ ఖల్ అంటూ దగ్గుతో కూడిన, కరోనా జాగ్రత్తలు వినిపించసాగాయి..ఇంతకీ ఆ గొంతు ఎవరిది..?

Video Advertisement

మొదట ఖల్ ఖల్ అంటూ ఆ దగ్గు వినగానే మనం ఫోన్ చేసినవాళ్లే అలా దగ్గుతున్నారా అని కంగారు పడినవారూ ఉన్నారు.. పదేపదే కరోనా జాగ్రత్తలు విని విని విసుగెత్తి పోయిన వాళ్లూ ఉన్నారు.. కాని మన దేశంలో వినూత్నంగా ప్రారంభించిన ఈ కాలర్ ట్యూన్ యొక్క గొంతు ఎవరిదై ఉంటుందా అని తెలుసుకోవాలనే ఆసక్తి రోజురోజుకి ప్రజల్లో పెరగసాగింది.వారు కోరుకున్నట్టగానే సోషల్ మీడియాలో ఒక వీడియో దర్శనం ఇచ్చి ఆ గొంతు ఎవరిదో చెప్పేసింది.. ఆ ఖల్ ఖల్ గొంతు కర్ణాటకకి చెందిన జెస్సికా ఫెర్నాండేజ్ ది.

కర్ణాటకకు చెందిన 32ఏళ్ల జెస్సికా ఫెర్నాండేజ్, ప్రస్తుతం ఢిల్లీలోని కన్నడ సెకండరీ స్కూల్లో పిఇటిగా పనిచేస్తున్నారు.. లాక్ డౌన్ కారణంగా స్కూల్స్ కి సెలవులు ఇవ్వడంతో కర్ణాటకకు వచ్చారు జెస్సికా.. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ స్టూడియో నుండి  ఫోన్ రావడంతో, వాయిస్ వినిపించాకట, కానీ అది కాలర్ ట్యూన్ గా వస్తుందనే విషయం జెస్సికాకు ముందు తెలియదట.. టివిలోనో, రేడియోలోనో ప్రసారం చేస్తారేమో అనుకున్నారట జెస్సికా.

‘‘కొద్ది రోజుల  తర్వాత మా అమ్మ ఫోన్ చేసి నా వాయిస్ మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్‌గా వినిపిస్తున్నట్టు చెప్పారు. దీంతో వెంటనే ఢిల్లీ స్టూడియోకి ఫోన్ చేసి నా పేరు బయటకి చెప్పొద్దని కోరాను . పదే పదే నా స్వరం వింటే వినియోగదారులకు విసుగెత్తి ట్రోల్ చేస్తారని ఇన్నాళ్లూ దాచిపెట్టాను. ఎవరో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేయడంతో నా పేరు బయటికి వచ్చింది. అయితే ఇప్పుడు ట్రోలింగ్స్‌తో పాటు నాకు ప్రశంసలు కూడా అంతే స్థాయిలో అందుతున్నాయి.

దగ్గుతో మొదలయ్యే కాలర్ ట్యూన్ జెస్సీకా వాయిస్ కాగా.. మిగతా రెండు ట్యూన్లకు విద్య నారాయణ్ భట్ డబ్బింగ్ చెప్పారు. విద్య చాలా కాలం నుంచి వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు. మొత్తానికి కాలర్స్ అందరిని విసిగించిన ఆ ఖల్ ఖల్ వాయిస్ ఎవరిదో అనేది ఎంత సీక్రెట్ గా ఉంచిన, తెలిసిపోయింది.. ఈ ఇంటర్నెట్ యుగంలో సీక్రెట్ అనేదానికి అర్దమే లేదేమో.. ప్రస్తుతం కరోనా కాలర్ ట్యూన్ వాయిస్ ఈమెదే అంటూ జెస్సికా పేరు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.


You may also like

Leave a Comment