“వాల్తేరు వీరయ్య” సినిమా స్టోరీ లీక్..! ఇంక మెగా బ్లాక్ బస్టర్ పడినట్టేనా..?

“వాల్తేరు వీరయ్య” సినిమా స్టోరీ లీక్..! ఇంక మెగా బ్లాక్ బస్టర్ పడినట్టేనా..?

by Mohana Priya

Waltair Veerayya Movie Story : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా టైటిల్ టీజర్ ఇటీవల విడుదల చేశారు. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాట అయిన బాస్ పార్టీ ఇటీవల విడుదల అయ్యింది.

Video Advertisement

ఈ పాటకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మీద ప్రేక్షకులకి చాలా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఒక స్టోరీ వార్తల్లో నిలిచింది.

ఒకవేళ ఈ స్టోరీ నిజం అయితే మెగాస్టార్ మళ్లీ హిట్ కొట్టడం పక్కా అని అంటున్నారు. ఇంతకీ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉంటారు. ఒక భార్యకి పుట్టిన కొడుకు వీరయ్య. మరొక భార్యకి పుట్టిన కొడుకు రవితేజ. వీరయ్య ఆంధ్రలోని ఒక కార్మిక సంఘానికి నాయకుడిగా ఉంటాడు. రవితేజ పోలీస్ అవుతాడు. ఒక సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. మధ్యలో విలన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో చాలా సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలన్ ఎంట్రీ వల్ల వీరయ్య, రవితేజ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు? వారిద్దరూ కలిసారా లేదా? అనే అంశం చుట్టూ సినిమా తిరుగుతుంది.

minus points in chiranjeevi waltair veerayya title teaser

ఈ సినిమాలో వీరయ్య పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు అనే సంగతి తెలిసిందే. చిరంజీవి తండ్రి పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. సత్యరాజ్ చిరంజీవికి, రవితేజకి తండ్రిగా నటిస్తున్నారు. అలాగే విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి గోదావరి యాసలో మాట్లాడుతున్నారు అని టీజర్ చూస్తే ఈపాటికి అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ ఇదే స్టోరీ నిజం అయితే సినిమా హిట్ అవుతుంది అని అంటున్నారు. మరి సినిమా కథ ఇదేనా కాదా తెలియాలంటే సినిమా విడుదల అయ్యే అంతవరకు ఆగాల్సిందే.

Also Read:   అల్లరి నరేష్ “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” సినిమా… ఆ “ఫేమస్” సినిమాని చూసి రీమేక్ చేశారా..?


You may also like