ఒక దశాబ్దానికి పైగా కామెడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న అల్లరి నరేష్ ఈ మధ్య కాస్త సీరియస్ బాట పట్టాడు. “నాంది” తర్వాత మళ్లీ అల్లరి నరేష్ తెర మీదకు వచ్చిన చిత్రం ఇది. కామెడీ పాత్రల నుంచి మెలమెల్లగా పక్కకు జరుగుతూ వస్తున్న నరేష్ ఈసారి ప్రభుత్వ అధికారి పాత్రను ట్రై చేస్తున్నారు. ఆనంది ఈ చిత్రం లో కథానాయిక. ఏ.ఆర్ మోహన్‌ దర్శకత్వం వహించారు.

Video Advertisement

మారేడుమిల్లి అనే సుదూర కొండ ప్రాంతంలో జనానికి ప్రజాస్వామ్యరాజకీయ వ్యవస్థ పట్ల నమ్మకముండదు. ఓట్లేయము అని భీష్మించుకుని కూర్చుంటారు. హీరో తనకున్న సామాజిక దృక్పథంతో, పని పట్ల నిబద్ధతతో, సమయస్ఫూర్తితో ఊరి జనంలో ఎటువంటి మార్పు తీసుకురావడం, తద్వారా ప్రభుత్వంలో కదలిక తీసుకురావడమనేది కథాంశం.

did allari naresh tried a remake..??

గిరిజన ప్రాంతంలో ఎన్నికల అధికారికి ఎదురైన సమస్యలు, పరిష్కారం ఇలాంటివి డిస్కస్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఇది 2017 నాటి హింది సినిమా “న్యూటన్” నుంచి దాదాపుగా తీసుకున్న స్ఫూర్తి. ఆ చిత్రం లో కూడా హీరో ఎన్నికలు నిర్వహించడం కోసం ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడ ఎలాంటి సంస్కరణలు చేసాడు అన్నదే ఆ సినిమా. దీంతో ఈ రెండు చిత్రాలను కంపేర్ చేస్తున్నారు సినీ జనాలు. ఇది ‘న్యూటన్’ సినిమాకి రీమేక్ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

did allari naresh tried a remake..??

అయితే ‘మారేడుమిల్లి..’ కథాంశంగా బాగానే ఉన్నా ట్రీట్మెంట్ విషయంలో మరింత కామన్ సెన్స్, ఇంకెంతో ఇంటిలిజెన్స్ చూపించాల్సింది. అవి లేకపోవడం వల్ల మంచి సబ్జెక్టే అయినా చివరికొచ్చేసరికి తేలిపోయింది. ఎక్కడా మనసుకి హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలు లేవు. విషయం ప్రేక్షకుల మెదడుకి చేరుతుంది తప్ప మనసుని పట్టుకోదు. న్యూటన్ సినిమాలు మాత్రం కథనం, స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకున్నారు. అందుకే అక్కడ ఆ చిత్రం హిట్ టాక్ ని సొంతం చేసుకోగా..ఇక్కడ అల్లరి నరేష్ ప్రేక్షకులని అలరించలేకపోయాడు.

did allari naresh tried a remake..??

అల్లరి నరేష్ దీని తరువాత మళ్లీ నాంది దర్శకుడితోనే మరో డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు. సాహు గారపాటి దీనికి నిర్మాత.

Also Read: