శ్రీదేవితో బాలకృష్ణ ఎందుకు నటించలేదు తెలుసా.? అసలు కారణం ఇదే.!

శ్రీదేవితో బాలకృష్ణ ఎందుకు నటించలేదు తెలుసా.? అసలు కారణం ఇదే.!

by Mohana Priya

అతిలోక సుందరి శ్రీదేవి బాలనటి గా కెరీర్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. బాల కృష్ణ కూడా బాల నటుడి గానే కెరీర్ ను మొదలు పెట్టారు. కానీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. సూపర్ స్టార్ కృష్ణ హీరో గా వచ్చిన సినిమా “మా నాన్న నిర్దోషి” అనే సినిమా 1970 లో వచ్చింది. ఈ సినిమా లో శ్రీదేవి బాల నటి గా కనిపించింది. ఆ తరువాత “బడిపంతులు”, “విధి విలాపము” “నేను మనిషినే” వంటి సినిమాల్లో కూడా బాలనటి గా నటించింది. ఆ తరువాత 1978 లో వచ్చిన “పదహారేళ్ళ వయసు” సినిమా లో శ్రీదేవి హీరోయిన్ గా కనిపించింది.

Video Advertisement

ఆ తరువాత చాలా తెలుగు సినిమాల్లో చేసారు. మోసగాడు, వేటగాడు, కొండవీటి సింహం, ప్రేమాభిషేకం, బెబ్బులి పులి, కిరాయి కోటిగాడు, దేవత వంటి సినిమాలలో నటించనుంది. హటాత్తు గా ఆమెకు ఉత్తరాది లో అవకాశం వచ్చింది. 1974 లో బాలకృష్ణ బాలనటుడి గా సినిమాలు చేయడం ప్రారంభించారు. “తాతమ్మ కల” సినిమా తో బాలకృష్ణ తెలుగు తెర కు పరిచయం అయ్యారు. ఆ తరువాత భలే దొంగ, మంగమ్మ గారి మనుమడు, రామ్ రహీమ్, అన్నదమ్ముల బంధం, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణుడు వంటి సినిమాల్లో కనిపించారు.

శ్రీదేవి హీరోయిన్ గా అయిన తరువాత వెంకటేష్, చిరంజీవి, నాగార్జున వంటి హీరోలందరితో కలిసి నటించింది కానీ బాలకృష్ణ తో మాత్రం శ్రీదేవి ఒక్క సినిమా కూడా చేయలేదు. దీనికి కారణం ఏంటనే విషయమై పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు రావాల్సి ఉంది.

1987 లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వీరిద్దరి కాంబినేషన్ లో “సామ్రాట్” అనే సినిమా ను అనౌన్స్ చేసారు. ఆ తరువాత 1989 లో కోదండరామిరెడ్డి దర్శకత్వం లో “భలేదొంగ” సినిమా లో కూడా శ్రీదేవి నే హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. అయితే, శ్రీదేవి హిందీ సినిమాలతో వరుస ఆఫర్లతో బిజీ అయిపోయారు. దీనితో, బాల కృష్ణతో ఒప్పుకున్నా సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు సినిమా లోను, అనురాగ దేవత అనే సినిమాలో కూడా వీరిద్దరూ ఒక ఫ్రేమ్ లో కనిపించారు. కానీ, బాల కృష్ణ, శ్రీదేవి జంట గా మాత్రం ఎపుడు కనిపించలేదు.

 


You may also like