వరంగల్ లోని గొర్రెకుంట గన్నీ సంచుల గోదాంలోని బావిలో తొమ్మిది మృతదేహాలు బయటపడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది..మూడు రోజుల క్రితం దొరికిన ఈ మృతదేహాల కేసులో ముందు నుండి హత్య నేపధ్యంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు..కానీ ఎవరు చేశారు ఎందుకు  చేశారనేదానికి సమాధానాలు లభ్యం కాలేదు..అయితే తాజాగా ఆ హత్యలు తానే చేశానని అంగీకరించాడు సంజయ్ కుమార్ అనే వ్యక్తి.. ప్లాన్ ప్రకారమే వారిని హత్య చేసి బావిలోపడేసినట్టు వెల్లడించాడు.

Video Advertisement

warangal latest news

warangal latest news

అసలేం జరిగింది?

పశ్చిమ బెంగాల్ నుండి వలస వచ్చిన మక్సూద్ ఆలం గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్‌ స్టోరేజీ సమీపంలోని బార్‌దాన్‌ కుట్టే గోదాంలో పనిచేస్తున్నాడు  మహ్మద్‌ మక్సూద్‌ ఆలం , అతడితో పాటు అతడి  భార్య నిషా ఆలం కూడా అక్కడే పని చేస్తుంది,వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు..మక్సూద్ ఆలం, నిషాం ఆలంతో పాటు , కూతురు బుష్రా ఖాతూన్‌తో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు గురువారం బావిలో శవాలై తేలారు..వారిని ఎవరు చంపి ఉంటారా అనే దిశలో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు..మక్సూద్ ఆలం కి కూతురు బుష్రాతో పాటు మరో ఇద్దరు కుమారులు షాబాజ్ ఆలం, సోహిల్ ఆలం ఉన్నారు..వారిద్దరితో పటు మక్సూద్ ఆలంతోపాటు గోదాంలో పనిచేసే శ్యాం కుమార్ షా, శ్రీరాం కుమార్ షా అనే కుర్రాళ్లు కనిపించకపోవడం, వారి ఫోన్లు స్విఛ్చాప్ రావడంతో ఇదంతా వారి పనే అని మొదట పోలీసులు భావించారు..

warangal latest news

warangal latest news

ఆ గొడవే కారణమా??

కానీ అనూహ్యంగా మరుసటి రోజు ఈ నలుగురి మృతదేహాలతో పాటు మరో మృతదేహం అదే బావిలో లభ్యమైంది..ఆ ఐదో మృతదేహం ఎవరిదా అని ఆరా తీయాగా మక్సూద్ ఆలంకి సన్నిహితుడు మహ్మద్ షకీల్ గా గుర్తించారు.వీరందరిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అందరిని దర్యాప్తు చేయగా అంతకు ముందు రోజు స్థానికంగా కొంతమంది యువకులకు , ఆ కుటుంబానికి గొడవ జరిగిందనే విషయం తెలిసింది.

warangal latest news

warangal latest news

ఒక్కడే ఇన్ని హత్యలు ఎలా చేసాడు??

పోలీసులు వారందరని  ఎంక్వైరీ చేశారు..ఇక్కడ ఒక విషయం బయటపడింది. మక్సూద్ ఆలం కూతురు బుష్రా స్థానికంగా నివసించే యువకుడితో కొన్నాళ్లుగా సన్నిహితంగా మెలుగుతుంది..ఆ విషయంపై ఏదైనా వాగ్వివాదం జరిగి అతడే ఈ హత్యలు చేశారా అని ,కానీ ఇన్ని హత్యలు ఒక్కడు ఎలా చేయగలరని, అతడిని విచారించారు పోలీసులు..అప్పుడు కూడా ఎటువంటి విషయాలు బయటపడలేదు..

warangal latest news

warangal latest news

నిద్రమాత్రలు ఇచ్చి చంపేసాం…

కాల్ రికార్డ్ డేటా ఆధారంగా మొదటి నుండి సంజయ్ కుమార్ ని అనుమానిస్తూ..అతడిని నిందితుడిగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.అతడిని తమ స్టైల్లో విచారిస్తే అసలు విషయం బయటపెట్టాడు  “తానే ఈ హత్యలు చేశానని, ప్లాన్ ప్రకారం వారందరికి నిద్రమాత్రలు ఇచ్చి వారిని స్నేహితుల సాయంతో బావిలో పడేసానని చెప్పుకొచ్చాడు..ఆ కుటుంబాన్ని మాత్రమే చంపాలనుకున్నా అని కానీ, ఈ విషయం బయటకి వస్తుందనే భయంతో శ్యాం కుమార్ షా, శ్రీరాం కుమార్ షా ని కూడా చంపేసానని ..ఇదంతా మక్సూద్ ఆలం అల్లుడు ఖతూర్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వారిని చంపానని వెల్లడించాడు..సంజయ్ కుమార్ కి మోహన్ అనే మరో వ్యక్తి , ఒక ఆటో డ్రైవర్ సాయం చేసినట్టు తెలుస్తోంది..

కానీ ఖతూర్ కి ఈ కుటుంబాన్ని ఇంతమందని చంపాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న తలెత్తుతోంది..ఇక్కడే మరో అసలు విషయం బయటపడింది. కాల్ రికార్డ్స్ ప్రకారం ముందురోజు సంజయ్ ,బుస్రాతో మాట్లాడినట్టు తెలుస్తోంది..వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని..దాన్ని మక్సూద్ వ్యతిరేకించి సంజయ్ ని దూరం పెట్టాడని, అయినప్పటికి సంజయ్ ,బుస్రా ల మద్య కాల్స్, ఛాటింగ్ నడిచేదని స్పష్టం అవుతోంది..బుస్రా బీహార్ కి చెందిన మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే కారణం చేతనే ఆ కుటుంబాన్ని మట్టుపెట్టాడనేది మరో సమాచారం.మొత్తానికి ఈ హత్యలు చేసింది సంజయ్ అనేది స్పష్టం అవుతోంది..కానీ దానికి గల బలమైన కారణాలు ఏంటి?సంజయ్ కి సాయం చేసిన ఆ స్నేహితులు ఎవరు?? అనేది తెలియాల్సి ఉంది.