అల్లూరి సీతారామరాజుకి ఇన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయా..!?

అల్లూరి సీతారామరాజుకి ఇన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయా..!?

by Anudeep

Ads

భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి కేవలం 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి. రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటిమీద కనుకులేకుండా చేసిన సీతారామరాజు.  తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారు.

Video Advertisement

అల్లూరి సీతారామరాజు 1897 జులై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు. అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. రామరాజు తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి.. సంస్కృతం, జోతిష్యశాస్త్రం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారు.

అయితే.. అల్లూరి సీతారామ రాజుకు అనేక రకాల ప్రత్యేక శక్తులు ఉన్నాయని మీకు తెలుసా?

* అల్లూరి జ్యోతిష్య శాస్త్రాన్ని సరిగా అంచనా వేయగలడు. అలాగే అతను బుల్లెట్ షాట్లను కూడా తట్టుకోగలడు.

* రామరాజు మహాత్మా గాంధీని ఎంతగానో ఆకట్టుకున్నాడు అలాగే గాంధీ నేతృత్వంలోని సహాయ నిరాకరణ ఉద్యమం నుండి ప్రేరణ పొందాడు.

* అతను ఖాదీని ధరించమని మరియు మద్యపానం మానేయమని ప్రజలను ఒప్పించాడు. కానీ, హింస మాత్రమే దేశాన్ని నిజంగా విముక్తి చేయగలదని, అహింస కాదని అతను నమ్మాడు.

పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు అల్లూరి. ఈ విప్లవాన్ని ఎలాగైనా అణచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం.. మన్యం ప్రజలను కాల్చుకు తినడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలను చూడలేని రాజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు.

1924 మే 7న విశాఖపట్నం జిల్లా మంప గ్రామానికి సమీపాన సీతారామరాజు స్వయంగా పోలీసులకు లొంగిపోయారు. సీతారామరాజుపై అప్పటికే పగతో రగిలిపోతున్న బ్రిటిష్ అధికారులు ఆయన్ని చింతచెట్టుకు కట్టి కాల్చి చంపారు. సీతారామరాజు ఆశించి కలలుగన్న స్వాతంత్య్రం ఆయన ఆత్మత్యాగం చేసిన 28 సంవత్సరాలకు ఆగస్టు 15, 1947న భారత ప్రజలకు లభించింది.


End of Article

You may also like