Ads
కరోనా ప్రభావంతో రెండు సంవత్సరాలు విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు దూరంగా ఉన్నారు. ఈ సంవత్సరం పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది.
Video Advertisement
అయితే దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా విద్యా వేత్తలు చెబుతున్న కారణాలివి..
#1. కోవిడ్:
కోవిడ్ ప్రభావం ప్రపంచంలో అనేక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అలాగే విద్యా వ్యవస్థ కూడా దీని వల్ల అతలాకుతలం అయింది. దాని ఫలితమే మనం ఇప్పుడు చూస్తున్న విద్యార్థుల పాస్ పర్సెంటేజ్.
#2. ఆన్లైన్ క్లాస్సెస్:
అప్పటి వరకు రోజూ బడికి, కాలేజ్ కి వెళ్లిన విద్యార్థులు ఒక్కసారిగా ఆన్లైన్ క్లాస్సెస్ అంటే అర్థం చేసుకోలేకపోయారు. పైగా కొందరికి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేకపోతే ఇంకొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్ సరిగా లేక విద్యార్థులు క్లాసులకు దూరంగా ఉండిపోయారు.
#3. ఒత్తిడి:
కొంతమంది విద్యార్థులు టీచర్ డైరెక్ట్ గా ఒకటి రెండుసార్లు చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటిది అక్కడెక్కడో ఉండి చిన్న తెరపై కనిపించి టీచర్ చెప్పే పాఠాలను అర్థం చేసుకోవాలి అంటే కష్టమే.
#4. సెల్ ఫోన్ అతి వినియోగం:
క్లాస్సెస్ వినడానికని తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్ కొనిస్తే కొందరు క్లాస్సెస్ వినకుండా ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడి తరగతులకు హాజరవ్వకపోవడం ఒక ముఖ్య కారణం.
పై కారణాలతో విద్యార్థులు ఒక వైపు తరగతులు వినకా, విన్నది ఆన్లైన్ లో అర్థం కాక రెండు సంవత్సరాల తరువాత సడన్ గా పబ్లిక్ పరీక్షలు అనగానే ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అంతేకాక గత రెండు మూడు సంవత్సరాలుగా విద్యార్థులు నేర్చుకున్నది తక్కువ. కాబట్టి దాన్ని పరీక్షలలో సరిగా ప్రెసెంట్ చేయలేకపోయారు. దీంతో మొన్న వచ్చిన పదవ తరగతి, ఈ రోజు వచ్చిన ఇంటర్ ఫలితాలు ఇంజనీరింగ్ ఫలితాలను తలపిస్తున్నాయి.
End of Article