ఆన్ లైన్ లో తీసుకున్న అప్పు వల్ల ఎంత దారుణం జరిగిందో చూడండి.. ఫోటోలు మార్ఫింగ్ చేసి.. ఆపై..?

ఆన్ లైన్ లో తీసుకున్న అప్పు వల్ల ఎంత దారుణం జరిగిందో చూడండి.. ఫోటోలు మార్ఫింగ్ చేసి.. ఆపై..?

by Anudeep

Ads

ప్రస్తుత కాలంలో ఆన్లైన్ రుణాల పేరుతో ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఆన్లైన్ రుణ యాప్ నిర్వాహకులు కూడా ఎంతో కఠినంగా, క్రూరమైన  స్వభావంతో ఇచ్చిన రుణాలను తిరిగి తీసుకోవడానికి బాధితులను అనేక విధంగా వేధిస్తున్నారు. అప్పులు వసూలు చేయడానికి నిర్వాహకులు ఎంతటి దుర్మార్గానికి అయినా పాల్పడుతున్నారు.

Video Advertisement

వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొల్లు కళ్యాణి (30) అనే గృహిణి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆమె ఏపీలోని అనంతపూర్ కు చెందిన గోవింద్ రెడ్డి తో 8 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వారు అనంతపూర్ లో నివాసం ఉండేవారు. గోవింద్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కరోనా టైంలో ఆయన ఉద్యోగం పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ రుణాల అప్పులకు సంబంధించిన ప్రకటన కళ్యాణి కంటపడింది. తనకున్న ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు అనే ఉద్దేశంతో నిర్వహణకు 30 వేల రూపాయలు అడిగింది.  ఆమె పోను లోని కాంటాక్ట్ నెంబర్ లు ఫోటోలను యూస్ చేసుకుని షరతుతో ఆమె ఖాతా కు 30 వేల రూపాయలు జమ చేశారు. ఇచ్చిన గడువు దాటినా ఇప్పటికీ ఆమె అప్పు తీర్చలేకపోయింది. దీంతో యాప్ నిర్వాహకులు ఆమెనుంచి రుణాన్ని రాబట్టడానికి వేధింపులు మొదలుపెట్టారు. నువ్వు ఇచ్చిన టైంలోపు డబ్బులు కట్టకపోతే నీ చిత్రాలను నగ్నంగా మార్పింగ్ చేసి నీ సన్నిహితులకు, నీ స్నేహితులకు పంపుతామని బెదిరింపులు మొదలెట్టారు. ఒకరోజు గుర్తుతెలియని పురుషులు నగ్న చిత్రాలను ఆమెకు పంపి, అప్పు చెల్లించకపోతే ఈ పురుషులతో నువ్వు వివాహేతర సంబంధం పెట్టుకున్నామని బంధువులతో చెప్పి నీ కాంటాక్ట్స్ కు వాట్సాప్ గ్రూపులకు షేర్ చేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. ఈ బెదిరింపులకు భయపడి ఆమె 20 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.

Kalayani

తీవ్ర ఆందోళనకు గురైన కళ్యాణి మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లి చికిత్స చేయించగా కోలుకుంది. ఇంతలో యాప్ నిర్వాహకులు మళ్ళీ ఫోన్ చేయగా, ఆమె ఆత్మహత్యయత్నం చేసిన విషయాన్ని వారికి తెలియజేసింది. తమకు ఆ విషయాలు అవసరం లేదని నువ్వు చచ్చినా పరవాలేదని డబ్బులు చెల్లించమని మళ్ళీ బెదిరించడం మొదలు పెట్టారు. తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి వారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.


End of Article

You may also like