ఈ ఫోటో చూడగానే మొదట ఏమి కనిపించింది..? దానిని బట్టి మీరు ఎలాంటి వారో చెప్పేయచ్చు..!

ఈ ఫోటో చూడగానే మొదట ఏమి కనిపించింది..? దానిని బట్టి మీరు ఎలాంటి వారో చెప్పేయచ్చు..!

by Anudeep

Ads

మన బాడీ లాంగ్వేజ్, మన కదలికలు, దృష్టిని బట్టి మన స్వభావం, క్యారక్టర్ ఎలాంటిదో సైకాలజీ ద్వారా చెప్పేయచ్చు. సైకాలజీ అందరికి వచ్చే విద్య కాదు. కొంతమంది పట్టు బట్టి నేర్చుకుంటుంటారు కూడా. అలా నేర్చుకున్న టెక్నిక్స్ తో అవతలి వారి మాటలు, కదలికలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని అంచనా వేస్తుంటారు.

Video Advertisement

నిజానికి చాలా మంది సైకాలజీ అంటే ఈజీ సబ్జెక్టు అని అనుకుంటారు. కానీ.. ఇదో పెద్ద సముద్రం లాంటిది. తవ్విన కొద్దీ లోతు తెలుస్తూనే ఉంటుంది. దృష్టి, ముఖ కవళికల ఆధారంగా వ్యక్తిత్వాన్ని కనిపెట్టడం అంత తేలికేమీ కాదు.

ఇలా కనిపెట్టడం కోసం సైక్రియాట్రిస్టులు కొన్ని టెస్ట్ లు పెడుతూ ఉంటారు. వాటిల్లో ఒకటి ఆప్టికల్‌ ఇల్యూషన్‌ పర్సనాలిటీ టెస్ట్‌. ఇందులో పెద్ద పరీక్ష ఏమీ ఉండదు. ఒక ఫోటోను చూపిస్తారు. ఆ ఫోటోని చూడగానే మొదట ఏమి కనిపించిందో చెప్పమని అడుగుతారు. ఇలా అడిగాక, అవతలి వారు చెప్పిన సమాధానాన్ని బట్టి వారి వ్యక్తిత్వంపై ఓ అంచనాకి వస్తారు. ఇప్పుడు మీకు కూడా అలాంటిదే ఒక పరీక్ష.

psycology 1

ఈ ఫొటోలో మీకు ఏమి కనిపిస్తోందో చూసి చెప్పండి. ఈ ఫోటోని చూస్తే కొంతమందికి పుర్రె బొమ్మ కనిపిస్తుంది. మరికొందరికి చిన్న పాప కనిపిస్తుంది. ఇంకొందరికి ప్రకృతి కనిపిస్తుంది. అయితే చూడగానే మొదట ఏమి కనిపించిందో దానిని బట్టి మీ వ్యక్తిత్వంపై ఓ అంచనాకి రావచ్చు.

పుర్రె: మీకు చూడగానే పుర్రె కనిపిస్తే.. మీరు బాగా మేధావులు అని అర్ధం. మీకు ఉన్న బలాలలో మీ మేధోసంపత్తి కూడా ఒకటి. మీరు చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.

psycology 2

చిన్నారి: ఒక వేళ మీకు మొదట చిన్నారి కనిపిస్తే.. మీరు గతంలో ఉన్న కష్టాల నుంచి త్వరగా బయటపడతారని అర్ధం. ఎన్ని సమస్యలు ఉన్న ఒత్తిడికి లోను కాకుండా నిర్ణయాలు తీసుకుంటారని అర్ధం.

ప్రకృతి: మీకు బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న సీనరీ కనిపిస్తే మీరు మిమ్మల్ని మాత్రమే నమ్ముకునే వ్యక్తులు అని అర్ధం. అందరు భయాందోళనలతో ఉన్నా.. మీరు మీపై నమ్మకం కలిగి ఉంటారు. మీరు చేసే పని విజయాన్నిస్తుందని నమ్ముతారు. కష్ట సమయాలలో మీరు తీసుకునే నిర్ణయాల నుంచి సులువుగా బయటపడతారు.


End of Article

You may also like