TELANGANA ELECTIONS: “హంగ్” అంటే ఏంటి.? ఒకవేళ తెలంగాణలో హంగ్ వ‌స్తే పరిస్థితి ఏంటి.?

TELANGANA ELECTIONS: “హంగ్” అంటే ఏంటి.? ఒకవేళ తెలంగాణలో హంగ్ వ‌స్తే పరిస్థితి ఏంటి.?

by Mounika Singaluri

Ads

తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగిసిపోయింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ని కూడా ప్రకటించాయి. అయితే ఇందులో కొన్ని సంస్థలు కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రకటిస్తే, మరికొన్ని సంస్థలు బిఆర్ఎస్ కి అనుకూలంగా ప్రకటించాయి. అయితే కొందరు ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాదని అంటున్నారు. తెలంగాణలో హంగ్ వస్తుందని అంటున్నారు. అసలు చాలా మందికి హాంగ్ అంటే ఏంటో తెలియదు.

Video Advertisement

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 119 నియోజకవర్గాలకు జరిగాయి. ఏ పార్టీ అయినా అధికారం చేపట్టాలంటే అందులో సగానికి పైగా సీట్లు సంపాదించాలి.అంటే 119కు గాను 60 సీట్లు ఏ పార్టీ సంపాదిస్తుందో ఆ పార్టీ అధికారం చేపడుతుంది. అలా సంపూర్ణ మెజార్టీ రాని సందర్భంలో హంగ్ అని పిలుస్తారు.


అయితే ఇక్కడ హంగ్ వస్తే కీలకంగా కింగ్ మేకర్ గా మారేది ఎంఐఎం పార్టీ అని అంటున్నారు. ఎంఐఎం పార్టీ హైదరాబాద్ ప్రాంతంలో పలుచోట్ల బలంగా ఉంది. ఎన్నికల్లో ఎంఐఎం 7 సీట్లు సాధించవచ్చు అని సర్వేలు చెబుతున్నాయి. హంగ్ సిచువేషన్ వస్తే మాత్రం ఎంఐఎం బిఆర్ఎస్ పక్కన నిలబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ బిజెపి కూడా నాలుగైదు సీట్లు రావచ్చని అంటున్నారు. ఒకవేళ ఎమ్ఐఎం బిఆర్ఎస్ కి సపోర్ట్ చేయకపోతే బిజెపి టిఆర్ఎస్ కి మద్దతు ప్రకటించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పలువురు బిజెపి నాయకులు కాంగ్రెస్ కన్నా బిఆర్ఎస్ ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి.

mim

కాంగ్రెస్ కు మాత్రం ఓటు వేయొద్దని బహిర్గతంగానే చెప్పారు. ఈ లెక్కన చూసుకుంటే డిసెంబర్ మూడో తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు కూడా ఏ పార్టీ అధికారం చేపడుతుందనేది స్పష్టంగా చెప్పలేం.హంగ్ రాకుండా ఏదో ఒక పార్టీకి సంపూర్ణ మెజార్టీ రావాలని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రంలో హంగ్ సిచువేషన్ వస్తే భవిష్యత్తులో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తాయి. పూర్తి మెజార్టీ రావడమే తెలంగాణ రాష్ట్రానికి శ్రేయస్కరం అని అంటున్నారు.

Also Read:బర్రెలక్క భవిష్యత్తు గురించి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి.? ఎన్ని ఓట్లు రావచ్చు.?


End of Article

You may also like