• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో ఏం జరిగింది? ఎప్పటికి మరిచిపోలేని విషాదం!

Published on May 7, 2020 by Anudeep

కరోనా విపత్తు నుండి కోలుకోకముందే తెలుగు రాష్ట్రాల ప్రజల్లో వణుకు పుట్టించింది విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన.. ఒకవైపు కరోనా గురించి భయపడుతుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు..ఎక్కడి వాళ్లక్కడ స్పృహ తప్పి పడిపోతూ, జంతువులు నురగలు కక్కుకుంటూ చనిపోతూ, చెట్ల ఆకులు మాడిపోయినట్టుగా అవుతున్న విజువల్స్ ని టివిలో చూస్తూ కంటతడి పెట్టుకున్నవారెందరో..విశాఖ గ్యాస్ లీకేజి ఘటన భోపాల్ ఘటనని తలపిస్తోందంటూ కామెంట్స్ వస్తున్నయి.అసలింతకీ భోపాల్ లో ఏం జరిగింది? దాని తాలుకు ప్రభావం ప్రజలపై ఎలా పడింది.ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి?? చదవండి.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాదం

మప్పై ఏళ్ల క్రితం అంటే 1984 డిసెంబర్ 2-3 తేదిల్లో మధ్యప్రదేశ్లోని భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (UCIL) లోఅతి పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది..ప్రపంచంలోనే ఇది అతి పెద్ద పారిశ్రామిక విపత్తు. ఈ ఘటనని భోపాల్ విపత్తు లేదా భోపాల్ వాయువు విషాదం అని పిలుస్తారు . అర్దరాత్రి అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో  పురుగుమందుల ప్లాంట్లో ఈ ప్రమాదం సంభవించి, ప్రమాదకర వాయువు మిథైల్ ఐసోసైనేట్ (MIC ), ఇతర కెమికల్స్ విడుదల అయ్యాయి.

భోపాల్ ఘటన ఫలితం

ఈ దుర్ఘటనతో భోపాల్‌ నగరంలో మూడొంతుల భూభాగం విషతుల్యమైపోయింది. పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల భూగర్భ జలాలు కలుషితమయ్యాయి . భోపాల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 56 వార్డులు ఉంటే మొత్తం 36 వార్డుల్లో విషవాయువు వ్యాపించింది. ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన తాలుక ప్రభావం ఇప్పటికి అక్కడి ప్రజలను వెంటాడుతుంది..ఈ ప్రమాదం కారణంగా ఇప్పటివరకు 25 వేల మందికి పైగా మరణించినట్టు అంచనా, 5లక్షల మంది విషవాయువు ప్రభావానికి గురయ్యారు. . గర్భస్థ శిశువులు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యారంటే ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. వారంతా శారీరక, మానసిక వికలాంగులయ్యారు. వారి వారసులను కూడా ఈ ఘటన తాలుకు చేదు జ్ణాపకాలు వెంటాడుతున్నాయి.

శిక్ష-పరిహారం

యూనియన్‌ కార్బైడ్‌ కంపెనీ యాజమాన్యం పరిశ్రమను ఎవరెడీ కంపెనీకి అమ్మేసింది. దీంతో బాధితుల తరఫున భారత ప్రభుత్వం, అమెరికా న్యాయస్థానాల్లో పోరాడాల్సి వచ్చింది. దీనిపై మొత్తంగా 16,000 దావాలు వేశారు. ఇప్పటికి పీడకలలా వెంటాడుతూ, భోపాల్ వాసుల జీవితాలను వెంటాడుతున్న ఇంతటి ఘటనలో బాదితులకు దక్కిన నష్టపరిహారం ఎంతో తెలుసా కేవలం 15,000..నిందితులకు పడిన శిక్ష రెండేళ్లు, రెండువేల డాలర్ల జరిమానా..వీరిలో ఆ కంపెని యజమాని దేశం దాటిపోయి మళ్లీ తిరిగి రాకుండా శిక్ష కూడా అనుభవించకుండా 92ఏళ్లు బతికి 2014లో మరణించాడు.

విశాఖ ఘటన- భోపాల్ ఘటన పోలిక

ప్రస్తుతం విడుదలైన స్టైరీన్ వాయువుకంటే అత్యంత ప్రమాదకరమైనది.ముప్పై ఏళ్లక్రితం ఇప్పుడున్నంత టెక్నాలజి అభివృద్ది చెందలేదు.అర్దరాత్రి సంభవించిన ఘటనతో నిద్రలోనే ఎందరో ప్రాణాలు కోల్పోయారు.అప్పటి ఘటనలో మరణించిన ఒక చిన్నారి ఫోటో ఇప్పటికి ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తుంది,భయకంపితుల్ని చేస్తుంది.. ప్రస్తుతం విశాఖలో రెస్క్యూ టీం అందుబాటులో ఉండడం, అధికార యంత్రాంగం అప్రమత్తం అవడంతో ప్రాణనష్టం తక్కువగా సంభవించింది అని చెప్పవచ్చు.


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • “MI గెలుపు RCB ప్లేఆఫ్స్‌కి వచ్చిందిగా.?” అంటూ… MI vs DC మ్యాచ్‌కి ముందు ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్..!
  • RRR లో “మల్లి”గా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?
  • “ఇలా చేస్తే నేను ఏం చేయాలి..?” అంటూ… వైరల్ అవుతున్న ఒక యువకుడి “పెళ్లిచూపుల” ట్వీట్..! నెటిజన్ల రిప్లైలు అయితే ఇంకా హైలైట్..!
  • రిలీజ్ అయినప్పుడు ఈ 5 సినిమాలని ప్లాప్ అన్నారు…కానీ చివరికి కోట్లల్లో కలెక్షన్స్ కొల్లగొట్టాయి.!
  • నైట్ డ్రెస్ వేసుకొని రెస్టారెంట్ కి వచ్చావ్ ఏంటి జాన్వీ అంటూ…శ్రీదేవి కూతురుపై ట్రోల్ల్స్.!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions