అమెరికాలో లాక్ డౌన్ ఎత్తి వేసాక ఏం జరిగిందో తెలుసా? ఇదీ పరిస్థితి..!

అమెరికాలో లాక్ డౌన్ ఎత్తి వేసాక ఏం జరిగిందో తెలుసా? ఇదీ పరిస్థితి..!

by Anudeep

Ads

యధా రాజా తదా ప్రజా అని సామెత.. అదే అమెరికా విషయానికి వస్తే యాధా ట్రంప్ తదా ట్రంప్ పాలన అని అనుకోవచ్చు.. ప్రపంచదేశాలన్ని లాక్ డౌన్ ప్రకటించి కరోనాని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుంటే, అమెరికాలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, అనుసరిస్తున్న విధానాలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి..ట్రంప్ కు తోడు అమెరికన్స్ కూడా.. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా లాక్ డౌన్ పాటించడానికి నిరాకరిస్తూ రోడ్లపైకి వస్తున్నారు.. మొత్తానికి లాక్ డౌన్ తీసేశారు..ఇంతకీ అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా?

Video Advertisement

కోవిడ్-19 తో మొదట చైనా , తర్వాత ఇటలీ , స్పెయిన్ లాంటి దేశాలు అతలాకుతలం అయితే అమెరికా వాటన్నింటికి మించి కోవిడ్ -19 బారిన పడింది..రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తూ..నేటి వరకు సుమారు పదమూడు లక్షల మంది కరోనా బారిన పడగా, 76వేల వరకు మరణాలు సంభవించాయి..వారిలో రెండు లక్షల మంది వరకు చికిత్స పొంది హాస్పిటల్స్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికి లాక్ డౌన్ ఎత్తివేశారు.

అమెరికాలోని న్యూయార్క్ నగరం ఎక్కువగా కరోనా ప్రభావానికి గురయ్యారు..76వేల మరణాల్లో సుమారు పాతిక వేల వరకు న్యూయార్క్ లో సంభవించినవే. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత న్యూయార్క్ లో పరిస్థితి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.. అత్యధికంగా కరోనా ప్రభావానికి గురైన న్యూయార్క్లో లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. కాని దాని పరిసర ప్రాంతాల్లో కేసుల నమోదు ఎక్కువయింది.న్యూయార్క్‌కు దూరంగా ఉన్న ప్రాంతాల్లోనూ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.

అయోవాలో రికార్డు స్థాయిలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, టైసన్‌ ఫుడ్‌ పోర్క్‌ ప్లాంట్‌లో దాదాపు 730 మందికి వైరస్‌ సోకింది. కాన్సస్‌లోని షానీ కౌంటీలో కూడా వారం రోజులుగా కేసుల సంఖ్య రెట్టింపు అవుతోందని ఒక నివేదికలో వెల్లడైంది. లాక్డౌన్ నిబంధనలు సడలించిన రోజు నుండే కేసుల పెరుగుదల ఎక్కువ కావడం విశేషం. దేశ వ్యాప్తంగా ఒక్క రోజులోనే 20వేల కేసులు నమోదవగా, వెయ్యి మంది వరకు మరణించారు.

సామాజిక దూరం పాటించకపోతే ఆగస్టు నాటికి 1.34 లక్షల మంది మరణించే అవకాశం ఉందని వాషింగ్టన్ యూనివర్శిటీ సైంటిస్ట్ క్రిస్టఫర్ ముర్రే రూపొందించిన మోడల్ ముందే అమెరికాను  హెచ్చరించింది.  ప్రస్తుతం అమెరికాలో కేసుల సంఖ్య చూస్తుంటే , సామాజిక దూరం పాటించకుండా, ఇది ఇలాగే కొనసాగితే ఈ హెచ్చరిక నిజమయ్యేలా ఉంది.

source: sakshi


End of Article

You may also like