Ads
తెలుగులో లేడీ కమెడియన్ అనగానే గుర్తొచ్చే పేరు కోవై సరళ. తమిళనాడు లో పుట్టినా టాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్నారామె. ముఖ్యం గా కోవై సరళ – బ్రహ్మానందం కాంబినేషన్ సూపర్ హిట్ కావడంతో వారు స్టార్ కామెడియన్లుగా మారిపోయారు. కొన్ని వందల సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు.
Video Advertisement
అయితే ప్రస్తుతం కోవై సరళ తెలుగు చిత్రాల్లో ఇకనిపించడం తక్కువైంది. తెలుగు లో ఆమెకు అవకాశాలు తగ్గాయో.. లేక ఆమే తెలుగుకి దూరం ఉంటుందో తెలియట్లేదు. అప్పుడప్పుడు కొన్ని కోలీవుడ్ చిత్రాల్లో ఆమె కనిపిస్తున్నారు. అయితే తాజాగా కోవై సరళ నటిస్తున్న ఒక చిత్రం నుంచి ఆమె లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్. అందులో ఆమెను చూసిన ప్రేక్షకులు ఆమె అసలు కోవై సరళ ఏ నా అని ఆశ్చర్య పోతున్నారు.
2019 లో వచ్చిన అభినేత్రి మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆమె.. తాజాగా మరో చిత్రం తో వస్తున్నారు. ‘అరణ్య’ సినిమాతో టాలీవుడ్ లో కూడా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ ప్రభు సల్మాన్ తీస్తున్న కొత్త చిత్రం ‘సెంబి’ లో కోవై సరళ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. ‘సెంబి’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేయగా ఇందులో కోవై సరళ లుక్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇన్నాళ్లు ఆమెలో కామెడీ యాంగిల్ ని చూసిన ప్రేక్షకులు, ఈ కొత్త లుక్ చూసి షాక్ అవుతున్నారు. అంతలా కోవై సరళ చేంజ్ అయ్యారు.
ఇన్నాళ్లు కమెడియన్ గా ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఈ చిత్రం లో సీరియస్ గా ఉండే 70 ఏళ్ళ వృద్ధురాలి పాత్ర లో నటిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలను రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఏ విధంగా వాడుకుంటారో అనే పాయింట్ ఆఫ్ లో సినిమా వస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
End of Article