Ads
బాలీవుడ్ హీరోయిన్ మల్లికా శెరావత్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆమె తన సినిమాలతో వార్తల్లో నిలుస్తూ ఉండేది. ‘ఖ్వాహిష్’ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మల్లికా శెరావత్ ‘మర్డర్’ చిత్రంతో పాపులారిటీ తెచ్చుకుంది.
Video Advertisement
ఆ మూవీ నుండి ఎక్కువగా బోల్డ్ క్యారెక్టర్స్ లో నటించిన మల్లికా, పలు చిత్రాలలో ఐటెం సాంగ్స్ లో కూడా నటించింది. లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన దశావతారం మూవీలో కూడా మల్లికా శెరావత్ నటించింది. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం..
మల్లికా షెరావత్ 1976 లో అక్టోబరు 24న హర్యానాలోని చిన్న గ్రామం మోథ్ లో జన్మించింది. ఆమె తండ్రి పేరు ముఖేష్ కుమార్ లాంబా. వారిది సంప్రదాయ కుటుంబం. ఆమె అసలు పేరు రీమా లాంబా. ఇండస్ట్రీలో రీమా పేరుతో ఇతర నటీమణులతో ఉండడంతో తన పేరును మల్లికా గా మార్చుకుంది. షెరావత్ మల్లికా తల్లి పుట్టింటి ఇంటి పేరు. తల్లి ఇచ్చిన మద్దతు వల్ల ఆ పేరును ఉపయోగిస్తున్నానని ఒక సందర్భంలో ఆమె చెప్పింది.
మల్లికా షెరావత్ మధుర రోడ్ లో ఉండే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ మిరాండా హౌస్ లో డిగ్రీ చేసింది. మల్లిక సినిమాల్లో నటించడం తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆమె ఇంట్లో నుండి పారిపోయి వచ్చి, హిందీలో ఎంట్రీ ఇచ్చింది. మర్డర్ మూవీతో ఆమెకు గుర్తింపు వచ్చింది. వరుస సినిమాలలో నటిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.
2019 లో బూ సబ్కీ ఫటేగి అనే హారర్ కామెడీ వెబ్ సిరీస్ లో చివరిసారిగా నటించింది. ఏక్తా కపూర్ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో తుషార్ కపూర్, సంజయ్ మిశ్రా, కృష్ణ అభిషేక్, కికు శారదా వంటివారు నటించారు. ఇందులో మల్లికా దెయ్యంగా నటించింది. ఆ తరువాత బాలీవుడ్‌ను విడిచి యుఎస్‌కు వెళ్ళింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె మళ్ళీ నటించబోతున్నట్టు తెలుస్తోంది.
https://www.instagram.com/p/Cv4CrNvP7TE/
Also Read: బాహుబలి లాంటి సినిమాలని మించిన కథ..! అసలు అంతగా ఏం ఉంది ఇందులో..?
End of Article