Ads
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ అన్ ఆరోగ్యం గురించే ఇప్పుడు ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది..ఇంత ఆసక్తి నెలకొనడానికి కారణం కిమ్ ఆరోగ్యానికి సంబంధించి ఆ దేశం నుండి ఎటువంటి ప్రకటణ లేదు, మరోవైపు కిమ్ అజ్ణాతంలో ఉన్నాడు..దాంతో కిమ్ చనిపోయాడని కొందరు , లేదు రిసార్ట్ లో రెస్ట్ తీసుకుంటున్నాడని అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.
Video Advertisement
కిమ్ ఆరోగ్యం పట్ల ప్రపంచవ్యాప్త మీడియా సంస్థలన్ని రకరకాల వార్తలను ప్రచురిస్తున్నాయి. హాంకాంగ్ ఛానల్ కిమ్ మరణించాడని పేర్కొంది. దక్షిణ కొరియా మీడియా మాత్రం కిమ్ కి ఇటీవల గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స జరిగిందని, ఆరోగ్యంగా ఉన్నాడని ప్రచురించింది. కిమ్ ఆరోగ్యం పట్ల వస్తున్న వార్తల నేపధ్యంలో చైనా వైధ్యబృందాన్ని ఉత్తరకొరియాకు పంపింది. కిమ్ జంగ్ కొన్ని నెలలుగా గుండె సమస్యతో బాధపడుతున్నాడని ఉత్తరకొరియాకి వెళ్లిన చైనా వైద్య బృందంలోని ఒక సభ్యుడు జపాన్ పత్రికకు తెలిపాడని కొన్ని వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన 38నార్త్ అనే వెబ్సైట్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఉత్తర కొరియా తూర్పుతీరంలో కిమ్ కు లగ్జరీ బీచ్ రిసార్ట్ ఉంది, అక్కడి రైల్వేస్టేషన్లో రైలు ఆగి ఉన్న చిత్రాన్ని ఆ వెబ్సైట్ రిలీజ్ చేసింది.ఆ స్టేషన్ ని కేవలం కిమ్ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే వినియోగిస్తుంటారు. అతను తన వ్యక్తిగత రైలులో అతి కొద్దిమంది సిబ్బందితో ఆ రిసార్ట్ కి వెళ్లి అక్కడే సేద తీరుతున్నాడని వార్తలు రాసాయి కొన్ని మీడియా సంస్థలు.
కిమ్ ని ఆ ట్రెయిన్లో వెళ్తుండగా చూసాం అని కొందరు, ఆ రిసార్ట్ లో నడవడం చాలా మంది చూసారని మరికొందరు వార్తలు ప్రచురించారు. అతని సన్నిహితులకు కోవిడ్-19 లక్షణాలు ఉన్నాయని తెలియడంతో రాజధాని వదిలివెళ్లాడని మరికొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
కిమ్ అంటే గిట్టని ట్రంప్ మరియు దక్షిణ కొరియా కూడా కిమ్ ఆరోగ్యం గానే ఉన్నాడని చెప్తున్నాయి. కిమ్ ఆప్తమిత్రుడు చైనా తమ వైద్య బృందాన్ని పంపించింది కానీ తన క్షేమసమాచారాల గురించి కిమ్మనడం లేదు… సో…ఉత్తర కొరియా ఇదీ సంగతి అంటూ ప్రపంచం ముందుకు వచ్చేవరకు ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగుతుంటుంది…Stay Tuned…
End of Article