Ads
గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో అత్యంత పాపులర్ గా ఉన్న నటి సమంత అనడంలో సందేహం ఏమీ లేదు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత నిత్యం ఏదో ఒక కారణంతో నెట్ లో వైరల్ అవుతూనే ఉంది.
Video Advertisement
అది తన పర్సనల్ లైఫ్ కావచ్చు, తను నటించిన సాంగ్ కావచ్చు, లేదా కనిపించే యాడ్స్ కావచ్చు…ఇలా ఏదో ఒక రకంగా ఆమె చేసే ప్రతి పని సెన్సేషన్ అవుతూనే ఉంది. కానీ సామ్ మాత్రం ఎప్పుడు ఇటువంటివన్నీ లైట్ గా తీసుకుంటూ వచ్చింది.
ఎందుకో తెలియదు కానీ గత కొద్ది కాలంగా సమంత సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటూ వస్తుంది. కొత్తగా ఫోటోషూట్స్,ఇంటర్వ్యూస్ ఏమి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో సమంత గురించి తాజాగా ఓ న్యూస్ వైరల్ గా మారింది. గత కొద్ది కాలంగా ఆమె చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతుంది అని, అందుకే మీడియాకి దూరంగా ఉందని కొందరు అభిప్రాయపడితే, మరికొందరు ఆమె బయటకు రాకపోవడానికి ఏదో బలమైన కారణం ఉందని అభిప్రాయ పడుతున్నారు.
అయితే కొత్తగా సికింద్రాబాద్ లోని ఒక వేద పాఠశాలలో సమంత ప్రత్యేక పూజలు చేయించారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం నెట్ లో సందడి చేస్తున్నాయి. ఎప్పుడు హుషారుగా ఉండే సమంత ఈ ఫోటోలో ముఖం పీక్కుపోయి, డల్ గా ఒక పేషంట్లా తయారైనట్లు కనిపిస్తుంది. దానికి కారణం ఆమె చేయించుకున్న ఆపరేషన్ అయి ఉంటుంది అని కొందరు భావిస్తున్నారు.
ఏది ఎలా ఉన్నా పాపం సమంత మాత్రం ఈ ఫోటోలో చాలా డల్ గా ఉంది. అసలు గుర్తుపట్టలేని విధంగా ఉన్న సమంతను చూసి ఆమె అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు. అయితే, ఆమె నటించిన యశోద, శాకుంతలం చిత్రాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఆమె చేస్తున్న ఓ హిందీ వెబ్ సిరీస్ నిర్మాణంలో ఉంది. విజయ్ దేవరకొండతో కలసి నటిస్తున్న ఖుషి కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బిజీ షెడ్యూల్ తో ముందుకు దూసుకెళ్తున్న సమంత ఆరోగ్యపరంగా కూడా బాగుండాలి అని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.
End of Article