మీ స్థాయి ఏంటి… మీరు చేసేది ఏంటి..? ఏంటి శంకర్ గారూ ఇది..?

మీ స్థాయి ఏంటి… మీరు చేసేది ఏంటి..? ఏంటి శంకర్ గారూ ఇది..?

by Mohana Priya

Ads

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్లు ఉంటారు. కానీ సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచే డైరెక్టర్లు మాత్రం కొంత మంది మాత్రమే ఉంటారు. వీరిలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి శంకర్. శంకర్ తమిళ డైరెక్టర్. చాలా వరకు తమిళంలో మాత్రమే సినిమాలు దర్శకత్వం వహించారు. కానీ ప్రపంచవ్యాప్తంగా శంకర్ సినిమాలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. మొదటి సినిమా నుండి కూడా సమాజం గురించి ఏదో ఒక విషయాన్ని తన సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. శంకర్ సినిమా వస్తోంది అంటే అదొక రకమైన ఆసక్తి ఉంటుంది. శంకర్ సినిమాల్లో పాటల గురించి ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు.

Video Advertisement

ఒక పాటని ఇలా కూడా తీస్తారా అని ఆశ్చర్యపోయేలాగా చేస్తారు. శంకర్ సినిమాల్లో ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ సినిమా ఎంత ఫ్లాప్ అయినా కూడా పాటలు మాత్రం చాలా పెద్ద హిట్ అయ్యాయి. కొన్ని పాటల కోసం లొకేషన్స్ పాటకి అనుకూలంగా అవ్వడం కోసం సంవత్సరాలు ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కేవలం శంకర్ మాత్రమే చేయగలుగుతారు. శంకర్ లాగా ఒక్కసారి అయినా సరే ఒక పాటని చిత్రీకరించాలి అని చాలా మంది దర్శకులు అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి శంకర్ మీద ఇటీవల కామెంట్స్ వస్తున్నాయి. అందుకు కారణం ఏంటో అందరికీ తెలిసిందే.

ram charan shankar movie heroine

రామ్ చరణ్ లాంటి హీరోతో శంకర్ మొదటిసారి తెలుగులో సినిమా రూపొందిస్తున్నారు. ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం సినిమా నుండి విడుదలైన మొదటి పాటలో క్వాలిటీ లోపం కనిపించింది అని అంటున్నారు. శంకర్ సినిమాలో లిరికల్ వీడియోలో ఇలా ఎప్పుడు జరగలేదు. గేమ్ ఛేంజర్ పాట కోసం కూడా చాలా మంది పనిచేశారు. 15 కోట్ల రూపాయలు పెట్టి సెట్ వేశారు. అన్ని చేసినా కూడా పాటలో క్వాలిటీ కనిపించట్లేదు. అందుకు కారణం సంగీత దర్శకుడు ఎంపిక అనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

guntur kaaram game changer song comments

తమన్ పాటలు విని విని తెలుగు ప్రేక్షకులకు బోర్ కొట్టేసాయి. ముఖ్యంగా అవే డప్పు సౌండ్స్ విని చిరాకు వచ్చింది. ఇప్పుడు ఈ పాట కూడా వాటి లాగానే ఉంది. శంకర్ పాటలు అంటే కాస్త కొత్తదనం ఆశిస్తాం. కానీ ఈ పాటలో అది తక్కువగా ఉండడంతో కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. శంకర్ స్థాయికి తగ్గ పాట ఇది కాదు. శంకర్ సినిమాలో పాట అంటే చూడడానికి మాత్రమే కాకుండా, వినడానికి కూడా హై క్వాలిటీలో ఉంటాయి. కానీ ఈ పాట మాత్రం అలా లేదు అని అంటున్నారు. దాంతో ఈ పాట మీద కామెంట్స్ వస్తున్నాయి.

ALSO READ : ధోని భార్య ఏ ఉద్యోగం చేస్తారో తెలుసా..? ఆమె ఎంత సంపాదిస్తారంటే..?


End of Article

You may also like