ఉసేన్ బోల్ట్‌ను దాటేసిన పరుగుల వీరుడు శ్రీనివాస్ గౌడ ఇప్పుడు ఏమయ్యారు?

ఉసేన్ బోల్ట్‌ను దాటేసిన పరుగుల వీరుడు శ్రీనివాస్ గౌడ ఇప్పుడు ఏమయ్యారు?

by Anudeep

Ads

సోషల్ మీడియా ఎవరిని ఎప్పుడు ఆకాశానికి ఎత్తేస్తుందో దానికే తెలీదు. సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్ నైట్ సెలబ్రిటీలు అయిన వాళ్లు ఎందరో. మెయిన్ స్ట్రీం మీడియా పట్టించుకోని చాలామందిని, చాలా వార్తల్ని సోషల్ మీడియా అందరికి చేరవేస్తుంది. స్టార్లని చేస్తుంది. అలాంటి వాడే శ్రీనివాస గౌడ . ఉసేన్ బోల్టుని మించిన వాడని పొగిడిపొగిడి పేజీల నిండా వార్తలు నింపేసింది. మరిప్పుడు శ్రీనివాస గౌడ ఏం చేస్తున్నడు.

Video Advertisement

జంట దున్నల్ని పట్టుకుని బురద నీటిలో వాటి వెంట పరుగుపెట్టాలి , అదే కంబాలా. కర్ణాటకకి చెందిన ఈ ప్రత్యేకమైన పోటీలను కర్ణాటక మీడియా తప్ప జాతీయ మీడియా పెద్దగా ఫోకస్ చేయదు.అలాంటిది ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దాంతో మీడియా కూడా అటు వైపు దృష్టి సారించింది.   అలాంటి పోటీల్లో పాల్గొనే శ్రీనివాస గౌడ పరుగుకి సంబంధించిన వీడియో అది . ప్రపంచ పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ రికార్డుని తిరగరాసాడనేది సారాంశం . ఉసేన్ బోల్టుని మించినవాడని కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు బురదనీళ్లల్లో పరిగెత్తడం, ట్రాక్ పైన పరిగెత్తడం ఒకటి కాదని విమర్శించారు.

సోషల్ మీడియాలో వైరలైన ఆ వీడియో సాయ్ వరకు చేరింది. శ్రీనివాస గౌడకు కోచింగ్ ఇప్పిస్తే ఒలంపిక్స్ లో పతకాలే పతకాలు అంటూ సాయ్ కి రికమెండ్ చేశారు . స్పోర్ట్స్ అథారిటి చైర్మన్ కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ శ్రీనివాస గౌడ దానికి ఒప్పుకోలేదు. మీరు విన్నది నిజమే. ఒప్పుకోలేదా అని ఆశ్చర్యపోకండి.నిజానికి ట్రాక్ పై పరుగుకి, కంబాలా పోటీలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. దాన్నే శ్రీనివాస గురువులు వివరించారు, వాళ్లు చెప్పేది సమ్మతమే అనిపించి శ్రీనివాస్ కూడా తనకు కంబాలే సరైనది అనుకున్నాడు.

స్పోర్ట్స్ అథారటి నుండి వచ్చిన పిలుపుకి నిర్మొహమాటంగా నో చెప్పేసిన శ్రీనివాస్, తన కంబాలా పోటీలు తన లైఫేంటో తను బతుకుతున్నాడు. అలా కాకుండా ఒక వేళ సాయ్ పిలుపుపై వెళ్లుంటే కంబాలా పోటీల్లో దక్కేంత ప్రచారం , పేరు దక్కకపోయేది. ఎందుకంటే ఈ పోటీలు పూర్తిగా భిన్నమైనవి, ఇక్కడ ఎంతో శిక్షణ ఉంటుంది. కాళ్లకి ఏం లేకుండా పరిగెత్తాలి, ట్రాక్ పై అలాకాదు . ఒకవేళ ఉసేన్ బోల్ట్ నే తీస్కొచ్చి కంబాలా పోటీల్లో పరుగుపెట్టిస్తే బోల్ట్ పరిస్థితి ఇంతే.

ప్రస్తుతం శ్రీనివాస తన పనేంటో తను చూసుకుంటున్నాడు. పోటీలు ఉన్నప్పడు బరిలోకి దిగుతాడు. లేని రోజుల్లో కూలి. సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేస్తున్నాడంటే మనోడి తినే తిండేంటో అని తెలుసుకోవాలనుందా అదేమంత  ప్రత్యేకమైనది కాదు . కర్ణాటకవాసులు తినే సాధారణ తిండే. సోషల్ మీడియా మాయలో పడి కొట్టుకుపోకుండా తన దారేంటో సరిగ్గా అవలోకనం చేసుకున్న ఏకైక వ్యక్తి శ్రీనివాస్.

నిజానికి ఇలా స్టార్లయిన వాళ్లంతా తర్వాత ఏమయ్యారు, ఏం చేస్తున్నారనేది పెద్ద ప్రశ్నే. ఒక పాట వీడియోతో లైమ్ లైట్లోకి వచ్చిన బేబిని సినిమా పరిశ్రమలో కొందరు పెద్దలు అక్కున చేర్చుకున్నారు. ఆ నాలుగు రోజులు ఎక్కడ చూసినా ఆమె గురించిన వార్తలే.రెండు రోజుల్లో ఆమె వేశధారణ మారిపోయింది. సినిమాల్లో పాడే అవకాశం వచ్చిందంటూ ఊదరగొట్టారు. నిజంగానే ఒక సినిమాలో పాట పాడినట్టున్నారు. కానీ తర్వాత ఏమయ్యారో ఎవరికి తెలీదు. ఎవరూ పట్టించుకోరు. ఒకరి తర్వాత ఒకరుగా వస్తుంటారు . పోతుంటారు.ఇదంతా ఒక ప్రపంచం.


End of Article

You may also like