Ads
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ గుర్తింపు లేకపోయినా చాలా మంది కథలను నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనేలా మనం ఎదిగాం. ఈ తరుణం లో కొందరు టాలీవుడ్ యంగ్ హీరోలు మాత్రం వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. మొదట్లో మంచి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న వీరు.. ఇప్పుడు కథల ఎంపిక లో తడబడుతున్నారు.
Video Advertisement
సీనియర్ హీరోలైన వెంకటేష్, నాగార్జున ఇప్పటికీ తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కానీ కొందరు యంగ్ హీరోలు మాత్రం మూస కథలను ఎంచుకొంటూ తమ భవిష్యత్తును డైలమాలో పడేసుకుంటున్నారు. ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
#1 విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డం తెచ్చుకున్న విజయ్ డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో ప్లాప్ ల బాట పట్టదు. తర్వాత పూరి దర్శకత్వం లో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయినా ‘లైగర్’ సినిమాపాయి చాలా ఆశలు పెట్టుకున్నాడు విజయ్. కానీ ఆ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది.
#2 వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్ మొదటినుంచి వైవిధ్యమైన కథలోనే ఎంచుకుంటూ వస్తున్నాడు. కానీ వరుణ్ కెరీర్ మాత్రం ఒక హిట్టు, ఒక ప్లాప్ అన్నట్టు సాగిపోతుంది. ఇక రీసెంట్ గా వచ్చిన ‘గని’ చిత్రం కోసం వరుణ్ చాలా కష్టపడ్డాడు. కానీ ఈ సినిమా అభిమానులను నిరాశ పరిచింది.
#3 రామ్
ఎనర్జిటిక్ హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత మంచి హిట్ కోసం చూస్తున్నాడు. కానీ రీసెంట్ గా వచ్చిన ‘వారియర్’ చిత్రం ప్లాప్ అయింది.
#4 శ్రీ విష్ణు
చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరో స్థాయికి ఎదిగిన నటుడు శ్రీ విష్ణు. ఆయన ఎంచుకొనే కథల్లో వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు ఈ యువ హీరో. కెరియర్ లో కొన్ని ప్లాపులుప్పటికీ వైవిధ్యమైన హీరో గానే అతనికి మంచి గుర్తింపు పొందారు. అర్జున పాల్గుణ, భళా తందనాన సినిమాలతో నిరాశలో ఉన్న శ్రీ విష్ణు తదుపరి చిత్రం పై ఆశలు పెట్టుకున్నారు. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ‘అల్లూరి’ చిత్రం అభిమానులను నిరాశ పరిచింది.
#5 నాగ శౌర్య
చాలా రోజులుగా వరస పరాజయాలను మాత్రమే చూస్తున్న నాగశౌర్యకి ఖచ్చితంగా హిట్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ అతని తాజా సినిమా ‘ కృష్ణ విందా విహారి’ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఈయన కెరీర్ డైలమాలో పడింది.
#6 సుధీర్ బాబు
గత మూడు చిత్రాలు ఫెయిల్ అవ్వటంతో ఈ సారి ఎలాగైన సక్సెస్ సాధించి హీరోగా కమ్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే తన లక్కీ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు వర్సటైల్ స్టార్ సుధీర్ బాబు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
#7 వైష్ణవ్ తేజ్
ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమా సూపర్ హిట్ అయినా ఆ తరువాత చేసిన కొండ పొలం మాత్రం ఈ యంగ్ హీరోకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. దీంతో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన రంగ రంగ వైభవంగా సినిమా పై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
ఇలా ఈ యంగ్ హీరోలు రోటీన్ స్టోరీలు ఎంచుకుంటూ, కమర్షియల్ సినిమాల వైపు వెళుతూ ఉంటే సీనియర్ హీరోలు మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలని, అలాగే వారు కూడా డిఫరెంట్ పాత్రలని పోషించాలి అని అనుకుంటున్నారు. నాగార్జున అయితే ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు అని చెప్పొచ్చు. కెరీర్ మొదటి నుండి ఇప్పటి వరకు కూడా నాగార్జున అన్ని రకాల సినిమాలు చేస్తున్నారు. అలాగే వెంకటేష్ కూడా ఈ మధ్య ఎక్స్పరిమెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. బాలకృష్ణ, చిరంజీవి కూడా డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటున్నారు.
End of Article