వీరిని ఎందుకు పట్టించుకోలేదు..? ఇంతమందిని ఎలా వదిలేశారు..?

వీరిని ఎందుకు పట్టించుకోలేదు..? ఇంతమందిని ఎలా వదిలేశారు..?

by Mohana Priya

Ads

మనం అనుకున్న పనిలో విజయం సాధించాలి అంటే కష్టపడడం ఎంత అవసరమో, ఆ కష్టానికి తగ్గ గుర్తింపు రావడం కూడా అంతే అవసరం. సినిమా ఇండస్ట్రీ అంటేనే కష్టాలు అని అంటారు. అలాంటి ఇండస్ట్రీలో ఒక్క సినిమా కోసం కొన్ని వందల మంది పనిచేస్తుంటారు.

Video Advertisement

ఇంక పెద్ద సినిమాలు అయితే వేల మంది జీవితం ఆ సినిమా మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి ఒక ఇండస్ట్రీలో ప్రతి విభాగంలో కష్టపడి పనిచేసి సినిమా విజయానికి వారి వంతు కృషి చేసిన వారికి అవార్డు ఇస్తారు. సినిమా ఇండస్ట్రీ, అవార్డు అంటే ఇప్పుడు గుర్తొస్తున్న ఒకే ఒక్క విషయం నేషనల్ అవార్డ్స్. ఇటీవల జాతీయ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొంత మంది ఈ అవార్డుల విజేతలని చూసి సంతోష పడితే, మరి కొంత మంది మాత్రం నిరాశ వ్యక్తం చేశారు.

గత రెండు సంవత్సరాల్లో ప్రతి ఇండస్ట్రీలో చాలా గొప్ప సినిమాలు వచ్చాయి. అందులో చాలా సినిమాలు చూసినప్పుడు, “ఈ సినిమాకి కచ్చితంగా అవార్డు రావాలి” అని అనుకున్నారు. కానీ అలా అనుకున్న సినిమాల్లో ఒక్క సినిమా కూడా ఇందులో లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా కొంత మంది నటులకి, టెక్నీషియన్లకి కూడా ఈ అవార్డుల విషయంలో అన్యాయం జరిగింది అని అంటున్నారు. ఆ విభాగాలు ఏంటో, అందులో అసలు ఎవరు గెలుచుకుంటే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారో ఇప్పుడు చూద్దాం.

#1 ఉత్తమ చిత్రం

ఇది మాధవన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన రాకెట్రీ సినిమాకి ఇచ్చారు. కానీ ఆ టైంలో ఇంకా చాలా మంచి సినిమాలు వచ్చాయి. జై భీమ్ మాత్రమే కాకుండా, గరుడ గమన వృషభ వాహన, జనగణమన, గ్రేట్ ఇండియన్ కిచెన్, సర్పట్టా, కర్ణన్, లాంటి సినిమాలని ఇందులో పరిగణలోకి కూడా తీసుకోలేదు. వీటిలో ఏ ఒక్క సినిమాకి అయినా కచ్చితంగా అవార్డు రావాలి అని అంటున్నారు. అంతే కాకుండా తెలుగులో ఉప్పెన సినిమాకి బెస్ట్ తెలుగు సినిమా అవార్డు ఇచ్చారు. కానీ రాజ రాజ చోర లాంటి సినిమాలని పట్టించుకోలేదు అని అన్నారు.

#2 ఉత్తమ నటి

ఈ కేటగిరిలో కాటియావాడి సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన ఆలియా భట్, మిమి సినిమాలో గర్భవతి పాత్రలో నటించిన కృతి సనన్ కి అవార్డు ఇచ్చారు. ఆలియా భట్ బాగా నటించారు. ఆమెకి అవార్డు రావడం చాలా మంచి విషయం. అలాగే కృతి సనన్ కూడా తన పాత్రలో బాగా నటించారు. కానీ జాతీయ అవార్డు ఇచ్చే అంత బాగా నటించారా అంటే కాదు అని అంటున్నారు.

jaibhim mistakes 1

ఎందుకంటే జై భీమ్ లో హీరోయిన్ గా నటించిన లిజోమోల్ జోస్, అంతే కాకుండా గ్రేట్ ఇండియన్ కిచెన్ లో హీరోయిన్ గా నటించిన నిమిషా సాజయన్, కృతి సనన్ తో పోలిస్తే ఎన్నో రెట్లు బాగా నటించారు. వారికి స్పెషల్ మెన్షన్ క్యాటగిరి లో కూడా ఒక్క అవార్డు ఇవ్వలేదు అని అన్నారు.

why do women in households eat at last

#3 ఉత్తమ నటుడు

అన్నిటికంటే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది ఈ ఒక్క కేటగిరి మాత్రమే అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చాలా బాగా నటించారు. అందులో అస్సలు సందేహం లేదు. కానీ ఈ సంవత్సరం RRR లో నటించిన ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరికి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నారు. వీళ్లు మాత్రమే కాకుండా జై భీమ్ సినిమాలో హీరోగా నటించిన మణికందన్ తన నటనతో ప్రేక్షకులని కంటతడి పెట్టించారు.

the reason why RRR got oscars for NAtu natu..!!

అతనికి కచ్చితంగా అవార్డు వస్తుంది అనుకున్నారు. అంతే కాకుండా ముఖ్యంగా సర్దార్ ఉదం సినిమాలో విక్కీ కౌశల్, జోజి అనే సినిమాలో ఫహాద్ ఫాజిల్, సర్పట్టా సినిమాలో ఆర్య, కర్ణన్ సినిమాకి ధనుష్ ఉత్తమమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాబట్టి అల్లు అర్జున్ కి అవార్డు ఇచ్చినా కూడా, మరొకరికి కూడా ఈ అవార్డు ఇవ్వాల్సింది అని అంటున్నారు.

what happened with national awards 2023

#4 ఉత్తమ సంగీతం

పుష్ప సినిమా పాటలు బాగున్నా కూడా జాతీయ అవార్డు వచ్చే అంత మంచి పాటలు ఇంకా చాలా సినిమాల్లో ఉన్నాయి అనే కామెంట్స్ వచ్చాయి. హిందీలో వచ్చిన షేర్షా, తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన తిరుచిత్రాంబళం సినిమాలో పాటలు ఇంకా బాగుంటాయి అని అన్నారు.

#5 ఉత్తమ ఎడిటింగ్

ఈ విభాగంలో సంజయ్ లీలా భన్సాలీ అవార్డ్ గెలుచుకున్నారు. కానీ గంగుబాయి కాటియావాడి సినిమా ఎడిటింగ్ తో పోలిస్తే మానాడు సినిమా ఎడిటింగ్ ఇంకా బాగుంటుంది అని, అసలు ఇలాంటి టైం లూప్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా హిట్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ ఎడిటింగ్ అని, అందుకే ఈ సినిమా ఎడిటర్ కి అవార్డు వచ్చి ఉంటే బాగుండేది అని అన్నారు.

simbu

#6 ఉత్తమ సహాయ నటుడు

ఇది కూడా మిమి సినిమాలో నటనకి గాను పంకజ్ త్రిపాఠి అందుకున్నారు. కానీ అదే సంవత్సరం వచ్చిన సర్పట్టా సినిమాలో పశుపతి నటన చాలా బాగుంది అని ఎంతో మంది ప్రశంసించారు. దాంతో ఆయనకి అవార్డు వచ్చి ఉంటే బాగుండేది అని అన్నారు.

what happened with national awards 2023ఈ విభాగాల్లో విజేతల పై మాత్రం చాలా మంది నిరాశ వ్యక్తం చేశారు. మన తెలుగు వాళ్ళు అవార్డులు గెలుచుకోవడం చాలా గొప్ప విషయం అని, కానీ వీరితో పాటు ఇంకా కొంత మందికి కూడా అవార్డు వచ్చి ఉంటే బాగుండేది అని అన్నారు. మరి వచ్చే సంవత్సరం అయినా ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకొని అవార్డు ఇస్తారు ఏమో.

ALSO READ : ఇలాంటి సినిమాకి ఒక్క నేషనల్ అవార్డ్ కూడా రాలేదా..? ఈ సినిమా చూశారా..?


End of Article

You may also like