“వైష్ణవి తేజ్” విషయంలో కూడా ఇలాగే జరగబోతోందా..?

“వైష్ణవి తేజ్” విషయంలో కూడా ఇలాగే జరగబోతోందా..?

by Megha Varna

Ads

ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి తేజ్ ప్రస్తుతం ఒక ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు. అదే ‘రంగ రంగ వైభవంగా’. ఇక ఈ సినిమా గురించి వివరాలను చూస్తే.. మే 27న ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Video Advertisement

రంగ రంగ వైభవంగా చిత్రానికి గిరీషయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కేతికశర్మ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

కేతిక శర్మ రొమాంటిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. రంగ రంగ వైభవంగా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తోంది. వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో మరింత స్టైలిష్ గా కనబడుతున్నారు. అయితే మరి వైష్ణవ తేజ్ కి ఈ చిత్రం సక్సెస్ ని ఇస్తుందా లేదా అనేది అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న.

ఎందుకంటే మెగా ఫ్యామిలీ కి ఈ మధ్య అంతగా కలిసి రావడం లేదు. దీంతో వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమా ఏమవుతుందో అని అనుకుంటున్నారు. ఒక పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది.

అలానే వరుణ్ తేజ్ ‘గని’ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా కూడా ఆకట్టుకోలేక పోయింది. ఇది కూడా నిరాశనే కలిగించింది. మరి మెగా స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన వైష్ణవ్ తేజ్ కూడా ఫ్యాన్స్ కి నిరాశే కలిగిస్తారా అనేది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. మరి వైష్ణవ తేజ్ ఈ చిత్రంతో ఆకట్టుకుంటారా లేదా అనేది చూడాలి.


End of Article

You may also like