అసలు “G20 సమ్మిట్” అంటే ఏంటి..? ఇందులో ఏం చర్చిస్తారు..?

అసలు “G20 సమ్మిట్” అంటే ఏంటి..? ఇందులో ఏం చర్చిస్తారు..?

by kavitha

Ads

జీ-20 సదస్సు దేశ రాజధాని డిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న విషయం తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు మరియు ప్రధానులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. భారత ప్రభుత్వం ఈ సదస్సు కోసం చేసిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Video Advertisement

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ అంశాలు, ప్రపంచీకరణను స్ట్రాంగ్ గా చేయడంలో జీ20 దేశాల కూటమి ముఖ్య పాత్రను  పోషిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు మొదటిసారి భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో జీ-20 సదస్సు అంటే ఏమిటి? ఈ సదస్సులో ఏం చర్చిస్తారో ఇప్పుడు చూద్దాం..
జీ20 అంటే ఇరవై దేశాలతో ఏర్పడిన ఒక సమూహం. జీ-20 సదస్సు అనేది వరల్డ్ ఫైనాన్షియల్ వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసుకున్న ఒక వేదిక. ఈ జీ20సదస్సులోని  దేశాలకు ప్రపంచంలోని ఆర్థిక ఉత్పత్తిలో ఎనబై ఐదు శాతం, ప్రపంచ వాణిజ్యంలో డెబ్బై ఐదు శాతం వాటా ఉంది. జీ20లో అర్జెంటీనా, యూకే, యూఎస్, బ్రెజిల్, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, ఫ్రాన్స్, భారత్, ఇండోనేషియా, జర్మనీ, జపాన్, మెక్సికో, ఇటలీ, రష్యా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, తుర్కియేతో పాటు స్పెయిన్ శాశ్వత గెస్ట్ గా ఉంది.
ప్రతిష్ఠాత్మక జీ-20 సదస్సుకు మొదటిసారి భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. సెక్యూరిటీ నుండి ఆతిథ్యం వరకు మన దేశ సంస్కృతి ఉట్టి పడేలా ఏర్పాట్లు చేసింది. ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని  భారత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది. ఈ ఏడాది జరగబోయే జీ-20లో స్థిరమైన అభివృద్ధి పై ఫోకస్ చేయనుంది. అదే విధంగా అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధిని పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యల పై చర్చ జరగనుందని సమాచారం. అభివృద్ధి చెందిన దేశాలకు మంచి జరిగేలా తక్కువ ఇంట్రెస్ట్ కు రుణాలు ఇచ్చేలా ఎండీబీలో మార్పులు తీసుకురావాలని చర్చ జరగనుంది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాతావరణంలోని మార్పులు, ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం మరియు పేదరికం పై పోరాడడానికి వరల్డ్ బ్యాంకు లాంటి సంస్థలు చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడతారని వైట్‌హౌస్ ప్రతినిధులు తెలిపారు.


End of Article

You may also like