శ్రీహరికోటలో మాత్రమే రాకెట్ ప్రయోగం ఎందుకు చేస్తారు..? దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే..?

శ్రీహరికోటలో మాత్రమే రాకెట్ ప్రయోగం ఎందుకు చేస్తారు..? దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే..?

by kavitha

Ads

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రయోగించి, దక్షిణ ధృవం పై అడుగుపెట్టిన తొలి దేశంగా ఇండియాను నిలిపింది. మరోసారి ప్రతిష్టాత్మక ప్రయోగానికి రెడీ అవుతోంది.

Video Advertisement

సూర్యగోళం యొక్క రహస్యాలను ఛేదించడం కోసం ఆదిత్య ఎల్1 ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి పరికరాలన్నీ శ్రీహరికోటకు చేరుకున్నాయి. ఈ క్రమంలో రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న రావడం సహజమే. మరి ఎందుకు శ్రీహరికోటను రాకెట్ ప్రయోగానికి ఎంచుకున్నారో ఇప్పుడు చూద్దాం..
ఇస్రో ప్రయోగం అని వినగానే, వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీహరి కోట. చంద్రయాన్‌1, 2, 3లతో పాటు ఎన్నో చారిత్రాత్మక ప్రయోగాలకు నెల్లూరులోని శ్రీహరి కోట వేదికగా మారింది. రాకెట్ ప్రయోగానికి శ్రీహరి కోటను ఎంచుకోవడానికి కారణం శ్రీహరి కోట స్పేస్‌ సెంటర్‌కు 5 ప్రత్యేకతలు ఉన్నాయి.
1. భూమధ్య రేఖకు సమీపంగా ఉండడం.. 

శ్రీహరికోట భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది. ఇక్కడి నుంచి రాకెట్‌ ప్రయోగించినపుడు సెకన్‌కు 0.4 కిలోమీటర్ల ఎక్స్ట్రా స్పీడ్ ను అందుకుంటుంది. భూభ్రమణం కారణంగా రాకెట్‌కు గంటకు 1440 కిలోమీటర్ల మేర అదనపు స్పీడ్ కలిసొస్తుంది.
33. భూమి స్వభావం..

రాకెట్ ప్రయోగాలకి వాతావరణం అనేది ఎంత ముఖ్యమో, అలాగే భూమి స్వభావం ముఖ్యమే. ఎందుకంటే, రాకెట్‌ ప్రయోగించే టైమ్ లో భూమి తీవ్రంగా కంపిస్తుంది. అది తట్టుకునేలా భూమి చాలా ధృడంగా ఉండాలి. శ్రీహరికోట బండరాళ్లతో కూడి చాలా బలంగా ఉంటుంది.
2. సుదీర్ఘ తూర్పు తీరం ఉండడం.. 

రాకెట్ ప్రయోగాలన్నీ విజయవంతంగా నింగిలోకి  వెళతాయనే గ్యారెంటీ లేదు. వాతావరణ లేదా సాంకేతిక కారణాలతో అవి నేలపై కూలిపోయే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో రాకెట్‌ శకలాలు జనావాసాల పై పడితే, చాలా  ప్రాణనష్టం కలుగుతుంది. అయితే శ్రీహరికోట చుట్టూ నీరే ఉంది. అటు వైపు బంగాళాఖాతం, ఒక వైపు పులికాట్ సరస్సు. రాకెట్‌ ఒకవేళ కూలిపోయినా దాని శకలాలు సముద్రంలో పడిపోతాయి.
4. రవాణా సదుపాయం..

రాకెట్‌ ప్రయోగాలం కోసం అధునాతమైన మరియు భారీ యంత్రాలు అవసరం అవుతాయి. వీటిలో కొన్ని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు రవాణాకు చాలా అనుకూలమైన ప్లేస్ ను కోసమే రాకెట్‌ ప్రయోగాల కోసం ఎన్నుకుంటారు. అలా రవాణా సదుపాయంలో శ్రీహరికోట అనుకూలంగా ఉంది. శ్రీహరికోటకు రైలు, రోడ్డు, జల రవాణా మార్గాలు ఉన్నాయి.
5. ప్రయోగాలకు అనుకూలమైన వాతావరణం..

రాకెట్ ప్రయోగాలకు  అనుకూల వాతావరణం ఉండడం అత్యంత కీలకమైన విషయం. ఎక్కువ ఎండలు కానీ, అధిక వర్షపాతం కానీ ఉండకూడదు.

ఇక శ్రీహరికోటలో సంవత్సరం పొడుగునా సాధారణమైన వాతావరణం ఉంటుంది. అక్టోబర్‌, నవంబర్‌ నెలలో మాత్రమే భారీ వర్షాలు పడుతాయి. అందువల్ల మిగిలిన పది నెలలు శ్రీహరికోట ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుంది.

Also Read: 41 రోజులు 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన… “చంద్రయాన్-3” ఇప్పుడు ఏం చేయనుంది.?


End of Article

You may also like