ఆఫ్గనిస్తాన్ లో అసలేం జరుగుతోంది..? అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఎందుకు రాజీనామా చేశారు..?

ఆఫ్గనిస్తాన్ లో అసలేం జరుగుతోంది..? అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఎందుకు రాజీనామా చేశారు..?

by Anudeep

Ads

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధికారం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి, రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రజాస్వామ్య దేశం అయిన ఆఫ్గనిస్తాన్ ప్రస్తుతం తాలిబన్ల చేతిలో ఉంది. అసలు ఆఫ్ఘనిస్తాన్ కు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

ఆఫ్గనిస్తాన్ లో కమ్యూనిస్టులు, ఇస్లామిక్ వాదులు అన్న రెండు వర్గాలు ఉన్నాయి. ఇస్లామిక్ వాదులనే ముజాహిద్దీన్ లు అని పిలుస్తారు. ఇప్పటివరకు ఈ రెండు వర్గాల మధ్య అధికార పోరాటం జరుగుతూ వచ్చింది. ఈ క్రమం లో కమ్యూనిస్టుల బలం తగ్గింది. దీనితో కమ్యూనిస్టు దేశమైన USSR ఆఫ్గనిస్తాన్ కు సపోర్ట్ ఇస్తూ వచ్చింది. మరో వైపు అమెరికా కు USSR కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.

afghanistan 1

ఆఫ్గనిస్తాన్ పై USSR పట్టు తగ్గించడానికి.. ముజాహిద్దీన్ లకు అమెరికా సపోర్ట్ ఇచ్చింది. వారికి డబ్బుని, ఆయుధాలను అందించడంతో వారి బలం పెరిగింది. ఈ క్రమం లో ఆఫ్గనిస్తాన్ లో కమ్యూనిస్ట్ లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 1991 వ సంవత్సరం లో USSR విచ్ఛిన్నమైపోయింది. దీనితో అమెరికా కు USSR కు మధ్య కోల్డ్ వార్ కూడా ముగిసినట్లయింది.

afghanistan 2

ఈ క్రమం లో ఆఫ్గనిస్తాన్ లోని ముజాహిద్దీన్ లు అల్ ఖైదా, తాలిబన్లు అనే రెండు వర్గాలు గా విడిపోయారు. ఆఫ్గనిస్తాన్ ఇలా మారిపోవడానికి అమెరికానే కారణమని అల్ ఖైదా భావిస్తూ వచ్చింది. దీనితో అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ అమెరికా పై 2001 వ సంవత్సరం లో 9 /11 దాడులు చేసారు. అప్పటికి జార్జి బుష్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఈ దాడి పై తీవ్రం గా స్పందించారు.

afghanistan 4

దాడి జరిగిన మరుసటి నెల అక్టోబర్ లోనే ఆయన ఆఫ్గనిస్తాన్ పైకి అమెరికా బలగాన్ని పంపించారు. ఈ క్రమం లో తాలిబన్లు కూడా అల్ ఖైదా కు సపోర్ట్ చేస్తున్నారని అమెరికా తెలుసుకుంది. దీనితో తాలిబన్లను కూడా టార్గెట్ చేసింది. 2011 వ సంవత్సరం లో పాకిస్థాన్ లో ఉన్న బిన్ లాడెన్ ను అమెరికా దళాలు చంపేశాయి. అమెరికా ను చూసిన చాలా మంది తాలిబన్లు పాకిస్థాన్ లో తలదాచుకున్నారు. తమ బలగాన్ని, ఆయుధ సంపత్తిని పెంచుకుని తిరిగి ఆఫ్గనిస్తాన్ కు చేరారు.

afghanistan 4

2001 నుంచి ఆఫ్గనిస్తాన్ లో తమ బలగాలను ఉంచిన అమెరికా.. జొబైడెన్ అధ్యక్షుడు అయిన తరువాత ఉపసంహరించుకుంది. ఆఫ్గనిస్తాన్ లో తమ బలగాలు ఉండడం వేస్ట్ అని జో బైడెన్ భావించారు. దీనికి ముందు గా తాలిబన్లతో మీటింగ్ ఏర్పరుచుకుని కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఒప్పందం లోని అంశాలకు తాలిబన్లు ఒకే చెప్పిన తరువాతే బలగాలను ఉపసంహరించారు. ఎయిర్ బేస్ నుంచి అమెరికన్ల బలగాలు ఖాళీ అయిన ఇరవై నిమిషాలకే.. ఆ ప్రాంతాన్ని తాలిబన్లు తమ కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు.

afghanistan 1

అక్కడ అమెరికన్ ఆయుధాలను సైతం తాలిబన్లు సొంతం చేసుకున్నారు. ఆఫ్గనిస్తాన్ లోని ప్రభుత్వాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యం గా పెట్టుకున్నారు. ఒక్కొక్కటిగా తమ అధీనం లోకి తెచ్చుకుంటూ.. చివరకు ప్రభుత్వాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ నాలుగు కోట్ల జనాభా ఉంది. తాలిబన్ల అరాచక పాలన ప్రారంభం కాబోతోంది. అగ్ర రాజ్యాలు చొరవ తీసుకుంటే తప్ప అక్కడి అరాచకాలను ఆపడం సాధ్యం కాదు.


End of Article

You may also like